24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: టీ కాంగ్రెస్ సీనియర్ ల వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ఈసీ భేటీకి ఆ 9 మంది సీనియర్లు డుమ్మా.

Share

Revanth Reddy:  టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమవేశం ఆదివారం జరిగింది. హాత్ మే హాత్ జోడో కార్యక్రమంపై ఈ సమావేశం లో నేతలు చర్చించారు. టీపీసీసీ కమిటీ నియామకాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేతలు ముందుగా నిర్ణయించుకున్న మేరకు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేతలు రాజనర్శింహ, మధుయాష్కీ, కోదండ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఈ సమావేశానికి గైర్హజరు అయ్యారు. నిన్ననే వీరంతా సమావేశమై రేవంత్ నాయకత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

Revanth Reddy

కాగా టీపీసీసీ ఈసీ సమావేశం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతోనే ఈ సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పై సమావేశంలో చర్చించామన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకూ అన్ని జిల్లాల్లో సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మోడీ, కేసిఆర్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగతామని చెప్పారు. ఇది క్రమంలో సోషల్ మీడియాలో సీనియర్ లపై దుష్ప్రచారం జరుగుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా రేవంత్ రెడ్డి స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సీపీ ఆనంద్
ఎలా చెబుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఐపీఎస్ అధికారా లేక ఒక పార్టీ కార్యకర్తనా అని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలపై ఎవరైనా వ్యతిరేక పోస్టులు పెడతారా అని రేవంత్ వ్యాఖ్యానించారు.

తీన్మార్ మల్లన్న ఎవరో తనకు తెలియదని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ఆయన ఎవరినో తిడితే నాకేమిటి సంబంధం అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా తిడితే వాళ్లను చెప్పుతో కొట్టండి కానీ తనపై అనవసరంగా విమర్శలు చేయవద్దని రేవంత్ రెడ్డి సూచించారు. ఎవరెవరో పెట్టిన పోస్టులకు తనకు ఆపాదించవచ్చని హితవు పలికారు. పార్టీ అధికారంలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడుగా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవిగా చూడవద్దని హితవు పలికన రేవంత్ రెడ్డి.. ప్రజా సమస్యలతో పోల్చుకుంటే పార్టీలో సమస్యలు పెద్దవి ఏమీ కావని అన్నారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే అధిష్టానం పరిష్కరిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మరో పక్క జనవరి 26వ తేదీ నుండి జూన్ రెండో తేదీ వరకూ తెలంగాణలో పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయడానికి రేవంత్ యాత్రను ప్రారంభించనున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను పీసీసీ విడుదల చేసింది. తెలంగాణలో ఇటీవల ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కు కొనసాగింపుగా నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని నిర్ణయించారు. అన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలు ఈ యాత్రను చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించింది.
టీ కాంగ్రెస్ లో ముదురుతున్న సంక్షోభం .. పీసీసీ కమిటీలకు 12 మంది రాజీనామా


Share

Related posts

ఆర్ధిక నేరస్తుడిగా మహేష్ బాబు .. ” సర్కారు వారి పాట ” సినిమా కథ ఇదే ..!

GRK

ఉద్యోగస్తులకు తీపి కబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!!

sekhar

అయోధ్యకు బీజం వేసింది… నేడు దూరమైంది వీళ్ళే…! బీజేపీలో హీట్ రాజకీయం..!

somaraju sharma