తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై మరో సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

Share

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై మరో సీనియర్ నేత ఫైర్ అయ్యారు. గ్రూపు రాజకీయాలతో తెలంగాణ కాంగ్రెస్ సతమతమవుతున్న విషయం తెలిసిందే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఆ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21న బీ జే పీలో చేరుతున్నారు. రాజగోపాల్ రెడ్డి సోదరుడు, భువనగిరి కాంగ్రెస్ ఎం పీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ రెడ్డి పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ .. వ్యూహ కమిటీ ఏర్పాటు విషయంలోనూ తనతో చర్చించ లేదని, తన నియోజకవర్గ పరిధిలో జరిగే కార్యక్రమాలకు తనను ఆహ్వానం లేదని వెంటరెడ్డి ఇంతకు ముందే పేర్కొన్నారు. పిలవని పెళ్లికి వెళ్లే రకం కాదని వెంకటరెడ్డి స్పష్టం చేస్తూ మునుగోడు ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు వెంకటరెడ్డి.

 

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్ కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేసిన తర్వాత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాంతించలేదు. దయాకర్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ లో ప్రస్తుత కల్లోల భరిత వాతావరణానికి కారణం రేవంత్ రెడ్డేనని ఆరోపించారు శశిధర్ రెడ్డి. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కలత చెందానని అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్ లో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు శశిధర్ రెడ్డి.

telangana congress next target is 79 seats

పార్టీకి నష్టం కల్గించే పనులు రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ లను రేవంత్ రెడ్డి అగౌరవపరస్తుంటే అధిష్టానం ఎందుకు మందలించడం లేదని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఏజంట్ గా మాణిక్యం ఠాగూర్ (పార్టీ తెలంగాణ ఇన్ చార్జి) వ్యవరిస్తున్నారని శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఇంతకు ముందు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన సీనియర్ నేతలు వి హనుమంతరావు, జగ్గారెడ్డి తదితరులు ఇప్పుడు సైలెంట్ గా ఉండగా, శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది.


Share

Related posts

Romance: శృంగారానికి బంగారం లాంటి నియమాలు ఉన్నాయి వాటిని  తెలుసుకోండి !!

siddhu

YS Jagan: జ‌గ‌న్ ఇచ్చిన మంచి చాన్స్ వ‌దిలేసుకున్న చంద్ర‌బాబు

sridhar

CM YS Jagan: త్రోబాల్ క్రీడాకారుడికి జగన్ సర్కార్ భారీ ఆర్ధిక సాయం.. చెక్కు అందజేసిన మంత్రి ఆర్కే రోజా

somaraju sharma