అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ రెండు మూడు వర్గాలుగా ఏర్పడి పీసీసీ పదవికి నేతలు పోటీ పడ్డారు. ఇంతకు ముందు పీసీసీ అధ్యక్ష పదవికి తొలుత రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు వినపడగా తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. రేవంత్ రెడ్డి వైపు పార్టీ అధిష్టానం సుముఖంగా ఉందని వార్తలు వచ్చిన వేళ వి హనుమంతరావుతో సహా పలువురు సీనియర్ నేతలు పార్టీ అధిష్టానానికి రేవంత్‌కు వ్యతిరేకంగా లేఖ కూడా రాశారు. పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ చార్జి పీసీసీ అధ్యక్ష ఎంపికపై దాదాపు 160మందికిపైగా నేతల అభిప్రాయాలను సేకరించి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, గ్రూపు రాజకీయాల నేపథ్యంలో పార్టీ సారధి ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాతే పీసీసీని నియమించాలని ఇప్పటికే అధిష్టానానికి సూచించారు.
పీసీసీ విషయంలో తర్జనభర్జనలు, రోజుకు ఒక పేరు తెరపైకి రావడం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఉప ఎన్నికల తరువాతే నియమించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని గురువారం మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తి అయ్యే వరకూ ఉత్తమ కుమార్ రెడ్డే పీసీసీ అధ్యక్షుడుగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల తరువాత కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నట్లు ఆయన ప్రకటించారు.
దుబ్బాక ఉప ఎన్నికలో ఘోర ఓటమిని చవి చూసిన కాంగ్రెస్ సాగర్ లోనైనా పరువు నిలుపుకోవాలని భావిస్తున్నది. సాగర్ ఉప ఎన్నికలో విజయం కోసం పార్టీ శ్రేణులు సమిష్టిగా పని చేస్తాయని ఠాగూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి సాగర్ ఉప ఎన్నిక విజయం దోహదం చేస్తుందని ఠాగూర్ అభిప్రాయపడ్డారు.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…