Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ తొలి సారి విచారణ ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకూ సాగింది. దాదాపు తొమ్మిది గంటల పాటు విచారణ జరిగింది. విచారణ అనంతరం కవిత తన సొంత కారులో ఈడీ ఆఫీసు నుండి బయటకు వచ్చారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

ఇవేళ కవితను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరగడంతో ఈడీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం అలుముకుంది. ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అక్కడ నుండి పంపించి వేశారు. కేంద్ర ప్రభుత్వ బలగాలతో ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవేళ ప్రాధమిక అంశాలపైనే విచారణ జరిగిందని తెలుస్తొంది. ఈ నేపథ్యంలో మరో సారి విచారణకు హజరుకావాలని ఈడీ అధికారుల తెలిపినట్లు సమాచారం. ఈ నెల 16వ తేదీన కవితను మరో సారి విచారించనున్నట్లు తెలుస్తొంది. విచారణ ముగిసిన అనంతరం కవిత ఈడీ కార్యాలయం నుండి బయటకు వచ్చి తుగ్లక్ రోడ్డులోని కేసిఆర్ నివాసానికి చేరుకున్నారు.
ఇక విచారణలో భాగంగా జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో నలుగురు అధికారుల బృందం కవితను పిఎంఎల్ఏ 50(2) ప్రకారం అనుమానితురాలిగా పేర్కొంటూ వాంగ్మూలం నమోదు చేసినట్లుగా తెలుస్తొంది. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, విజయ్ నాయర్, మనీశ్ సిసోడియా స్టేట్ మెంట్ ల ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది. అరుణ్ రామచంద్ర పిళ్లై తో కలిపి కవితను విచారించారు. ఆధారాలు ద్వంసం చేయడం, డిజిటల్ ఆధారులు లభించకుండా చేయడం, హైదరాబాద్ లో జరిగిన సమావేశలపై ప్రధానంగా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లుగా సమాచారం.
అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో జరిగిన భేటీలపైనా ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. మౌఖికంగా, లిఖిత పూర్వకంగా కవిత స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేశారు. తొలుత కవిత వ్యక్తిగత సమాచారాన్ని ఈడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కేసుకు సంబంధించి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం.
Breaking: ఈనాడు రామోజీకి ఏపి సర్కార్ బిగ్ షాక్ .. మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘనలపై సీఐడీ కేసు నమోదు