TRS: టీఆర్ఎస్‌కు బిగ్ షాక్ ..! కాంగ్రెస్ గూటికి ఆ మాజీ ఎమ్మెల్యే..?

Share

TRS: టీఆర్ఎస్‌లో అంతర్గత గ్రూపు రాజకీయాల కారణంగా ఓ మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు అధికారంలో వచ్చింది. 2023 ఎన్నికల్లోనూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి హాట్రిక్ సాధించాలన్న భావనలో టీఆర్ఎస్ ఉండగా, తెలంగాణలో అధికారమే లక్ష్యంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. అధికార పార్టీలో అసంతృప్తి నేతలను పార్టీలోకి చేర్చుకుని బలోపేతం అవ్వాలన్న ఆలోచనలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి.

TRS EX MLA Nallala Odelu joining Congress party

TRS: విభేదాలతోనే పార్టీ మార్పునకు నిర్ణయం

ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కాంగ్రెస్ గాలం వేసింది. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే ఓదేలు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని రాజకీయ వర్గాలకు తెలిసిన అంశమే. ఓదేలు భార్య నల్లాల భాగ్యలక్ష్మి మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఓదేలు చెన్నూరు నియోజకవర్గం నుండి 2009, 2010 ఉప ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో బాల్క సుమన్ టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఆ తరువాత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య గ్రూపు విభేదాల నేపథ్యంలో ఓదేలు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

TRS: రాహుల్ గాంధీ వద్దకు ఓదేలు

మాజీ ఎమ్మెల్యే ఓదేలును టీపీసీసీ అధ్యక్షుడు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్శింహా లు ఢిల్లీకి తీసుకువెళ్లారు. ఈ రోజు మధ్యానం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో వీరు భేటీ కానున్నారు. అక్కడ చర్చల అనంతరం రాహుల్ గాంధీ సమక్షంలోనే ఓదేలు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరతారా..? లేక తరువాత హైదరాబాద్ వచ్చిన తరువాత ప్రత్యేకంగా  ఏర్పాటు చేసే కార్యక్రమంలో పార్టీ కండువా కప్పుకుంటారా..? అనేది సాయంత్రానికి తేలనుంది.


Share
somaraju sharma

Recent Posts

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

23 mins ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

1 hour ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

3 hours ago

Upasana: పిల్లల విషయంలో రామ్ చరణ్ భార్య వేసిన ప్రశ్నకు సద్గురు సంచలన సమాధానం..!!

Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…

4 hours ago

Bimbisara: ‘బింబిసార’ తాత గారికి అంకితం కళ్యాణ్ రామ్ సంచలన కామెంట్స్..!!

Bimbisara: నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Kalyan Ram) 'బింబిసార'(Bimbisara) ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బింబిసార' సినిమా…

4 hours ago

Pavitra Lokesh: పోలీస్ కంప్లైంట్ చేసిన పవిత్ర లోకేష్..!!

Pavitra Lokesh: గత కొద్ది రోజుల నుండి నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) లకి సంబంధించి వార్తలు మీడియాలో సోషల్…

4 hours ago