తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో తొలి టీకా విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం సెన్సేషనల్ డెసిషన్..!!

Share

మహమ్మారి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 16 వ తారీకు నుండి దేశంలో ఉన్న అని రాష్ట్రాలలో దశలవారీగా పంపిణీ చేయటానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలలో తొలి టీకా ఆరోగ్య సిబ్బందికి ఇస్తుంటే తెలంగాణాలో టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం హాస్పిటల్ లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని సెన్సేషనల్ డెసిషన్ తీసుకోవడం జరిగింది.

Telangana ready to distribute covid vaccine, KCR tells PM Modiఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో అన్ని హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని  కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హెల్త్ కేర్ వర్కర్లకు టీకా ఇవ్వాలని పేర్కొంది. దీంతో పూణే నుండి హైదరాబాద్ కి చేరుకున్న వ్యాక్సిన్ ని జిల్లాలకు తరలించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.

 

కాగా తొలి రోజు కేవలం నాలుగు వేల మందికే వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. హడావిడిగా కాకుండా నెమ్మదిగానే పంపిణీ చేసే రీతిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో కేవలం 30 మందికి మాత్రమే టీకా ఇవ్వనున్నారు. 139 కేంద్రాలతోపాటు 40కిపైగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండగా తాజా మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కే టీకా ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.


Share

Related posts

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా‌తో ఏసి సిఎం వైఎస్ జగన్ మరో మారు భేటీ…ఎందుకంటే..?

Special Bureau

Deepti-shanmukh: దీప్తి సునైనాకి షణ్ముఖ్ చివరాఖరి ముద్దు.. తట్టుకోలేని వాళ్ళు ఈ వార్త చదవకండి!

Ram

బాబు,పవన్‌లపై అంబటి ఫైర్

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar