NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో ఐటీ, ఈడీ దాడులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈడీ, ఐటీ, సిట్ విచారణలు హాట్ టాపిక్ గా మారాయి. తమ పార్టీ నేతలే లక్ష్యంగా బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ తనిఖీలు చేయిస్తొందని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, బీజేపీ కీలక నేతల లక్ష్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదని ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మరో మంత్రి మల్లారెడ్డి అన్నారు. చర్యకు ప్రతి చర్య కూడా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంటే కేంద్రంలోని బీజేపీ వారి ఆధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలను తమపై ప్రయోగిస్తే వాళ్లపై తమ ఆధీనంలోని దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తామని పరోక్షంగా పేర్కొన్నారు.

TRS MLC Kavitha

 

ఐటీ అధికారులు తన కుమారుడిని ఇబ్బందులకు, మానసిక వేదనకు గురి చేశారనీ, వారి ఇబ్బందుల వల్లనే తమ కుమారుడు ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందంటూ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఐటీ, సీఆర్పీఎఫ్ పై ఆరోపణలు చేసిన మంత్రి మల్లారెడ్డి .. వారిపై ఫిర్యాదు చేస్తామని కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాగిరెడ్డిపేట్ మండలం తాండూరు లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హజరైన కవిత మాట్లాడుతూ .. ఈడీ, ఐటీకి భయపడే ప్రసక్తే లేదని అన్నారు. తప్పు చేసిన వాళ్లే భయపడతారని అన్నారు. బీఎల్ సంతోష్ ఎందుకు విచారణకు రావడం లేదని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణకు పిలిస్తే తాము మాత్రం హజరు కావాలి కానీ బీజేపీ వాళ్లు విచారణకు రారా అని ప్రశ్నించారు.

బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్టు చేయకూడదని ప్రశ్నించారు. మన దగ్గర కేసులో దొరికితే విచారణ చేయకూడదా అని ప్రశ్నించారు. నెల రోజులుగా మంత్రులపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని అన్నారు. బీఎల్ సంతోష్ ను విచారణ కు రమ్మంటే కోర్టుకు వెళ్లారనీ, సుప్రీం కోర్టు చెప్పినా విచారణకు రావడం లేదని పేర్కొన్నారు.  నిన్న సభ పెట్టి బండి సంజయ్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారో అర్ధం కాలేదన్నారు. తప్పు చేయకపోతే భయమెందుకని ప్రశ్నించారు. టీ బీజేపీకి నాయకులు లేరు, ఐడియాలజీ లేదని విమర్శించిన కవిత.. రామ్ నామ్ జప్నా ..పరాయి లీడర్ అప్నా పాలసీ అవలంబిస్తొందని అన్నారు. బీజేపీకి సొంత నాయకులు ఎవరూ లేరనీ, అందుకే ఈడీ, ఐటీ, సీబీఐ ద్వారా ఇతర పార్టీ నేతలను దొంగిలిస్తున్నారని ఘాటుగా విమర్శించారు ఎమ్మెల్సీ కవిత.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ అరెస్టుపై హైకోర్టు ఏమన్నదంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N