29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ వార్తలను ఖండించిన ఎమ్మెల్సీ కవిత

Share

సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇవేళ మరో సారి చుక్కెదురు అయ్యిందంటూ మీడియా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈడీ విచారణపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఈ నెల 24వ తేదీన విచారణ జరుపుతామని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈడీ మరో నోటీసులు కవితకు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన విచారణకు హజరుకావాలని నోటీసులో పేర్కొంది. దీంతో మరో సారి కవిత ఈ వేళ సుప్రీం కోర్టులో యర్లీ హియరింగ్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆ వార్తలను ఖండించారు. సుప్రీం కోర్టులో ఈ రోజు నేను కొత్తాగ ఎలాంటి పిటిషన్ వేయలేదు. ఇంతకు ముందు వేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానున్నది అని కవిత ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

MLC Kavita

 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఒక పర్యాయం విచారణ జరిపిన ఈడీ అధికారులు మార్చి 16 (నిన్న) మరో సారి విచారణకు హజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే తాను హజరు కాలేనంటూ ఈడీకి కవిత లేఖ రాశారు. దీంతో ఈ నెల 20న విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో 20వ తేదీన కూడా హజరు కాకుండా ఉండేందుకు మరో సారి కవిత ఇవేళ కోర్టు ఆశ్రయించారనే ప్రచారం జరిగింది. కోర్టు ఆమె విజ్ఞప్తిని తిరస్కరించిందనీ, 24వ తేదీనే విచారణ చేస్తామని తెలిపింది అన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలను ఆమె ఖండించారు. అయితే సుప్రీం కోర్టు విచారణలో తన పిటిషన్ ఉన్నందున ఈ నెల 20వ తేదీన ఈడీ విచారణకు కవిత హజరు అవుతారా లేదా అనేది ఆసక్తి నెలకొంది.

ప్రధాని మోడీతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ..ఈ కీలక అంశాలపై చర్చ


Share

Related posts

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో రాజకీయ ‘తుఫాన్’!ఇద్దరు మాజీ సహచరుల పిలక మమతా బెనర్జీ చేతిలో!

Yandamuri

Sai Manjrekar: ఈ రెండిటిలో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినా ఈ యంగ్ బ్యూటీ వెనక టాలీవుడ్ హీరోలు క్యూ కడతారు..!

GRK

AP Esma Act: ఉద్యోగుల సమ్మె నిర్ణయానికి ప్రభుత్వ విరుగుడు ఇదే..? నేటి కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం..??

somaraju sharma