TRS: టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ… హైద‌రాబాద్ ర‌చ్చ‌లో ఎవ‌రికి లాభం?

Share

TRS:  టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్లుగా సాగుతున్న హైద‌రాబాద్ ర‌చ్చ‌లో ఎవ‌రిది పైచేయి కానుంద‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స్వాత్రంత్య దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌రుగుతున్న కార్య‌క్రమాల్లో బీజేపీ కార్పొరేట‌ర్‌కు గాయాలైన సంగ‌తి తెలిసిందే. అయితే, దీనిపై ఇప్ప‌టికీ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమాంతరావు వ‌ర్సెస్ బీజేపీ శ్రేణుల మ‌ధ్య విమ‌ర్శ‌లు సాగుతున్నాయి.

Read More: KCR: ద‌ళిత‌బంధు కేసీఆర్ కు బెడిసికొడుతోందా?

మాట మీద ఉన్న మైనంప‌ల్లి…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమాంతరావు మరోసారి స్పష్టం చేశారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ ఓ వెధవ.. త్వరలోనే బట్టలిప్పి రోడ్డుమీద నిల్చో పెడతా అని హెచ్చరించారు. ‘‘కేసీఆర్ నాకు ఒక్కరోజు అవకాశం ఇస్తే బీజేపీ నేతల అంతు చూస్తా’’ అని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన గుండు సంజయ్‌ను బరాబర్ తిడతానని తెలిపారు. తనకు బహిరంగ క్షమాపణ చెబితే తప్ప నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తొందరలోనే బండి సంజయ్ భూముల వ్యవహారం ముందు పెడతానని తెలిపారు. మల్కాజ్‌గిరి ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దని…అశాంతి సృష్టించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు.

Read MoreKCR: కేసీఆర్ మ‌నిషిని బుక్ చేస్తున్న బీజేపీ

మల్కాజ్‌గిరిలో ఉద్రిక్తత
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బంద్ నేపథ్యంలో మల్కాజ్‌గిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షాపులను తెరవకుండా అడ్డుకుంటున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠిచార్జ్ చేశారు. మల్కాజ్‌గిరి వినాయక నగర్ చౌరస్తా వద్ద బీజేపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం.. తోపులాట చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వెంటనే ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇంకో కేస్‌…
ఇదిలాఉండ‌గా మ‌రో కేసు మైనంప‌ల్లిపై న‌మోదైంది. నేరెడీమేట్ పోలీస్ స్టేషన్ లో మైనంపల్లి హనుమంతరావు పై మరో కేస్ బుక్ అయింది. మైనంపల్లి పై 324,427,504,506,148 R/W 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మైనంపల్లి తనయుడు మైనంపల్లి రోహిత్ పై కూడా కేసు నమోదు అయింది. మౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ ఫిర్యాదు మేరకు నేరెడ్‌మేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.


Share

Related posts

నిరసన దీక్షలో కాంగ్రెస్ నేతల బాహాబాహీ

somaraju sharma

Eatela Rajendar: హరీశ్ రావు ప‌రిస్థితి ఆఖ‌రికి ఏం జ‌రుగుతుందో చెప్పిన ఈట‌ల‌

sridhar

చైతు లో ఈ రొమాంటిక్ యాంగల్ ని సామ్ కూడా ఉహించివుండదు

Naina