NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Komatireddy Venkat Reddy: తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన .. కావాలని కక్ష సాధింపు చర్యలు ఉండవు  కానీ ..

Komatireddy Venkat Reddy: తెలంగాణ రోడ్డు భవనాల (ఆర్ అండ్ బీ) శాఖ మంత్రిగా సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇవేళ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొదటగా మొత్తం తొమ్మిది దస్త్రాలపై సంతకాలు చేశారు. వీటిలో నల్గొండ నుండి ధర్మాపురం, ముషంపల్లి రహదారిని నాలుగు లైన్లుగా చేయడం, కొడంగల్, దుడ్వాల రహదారి విస్తీర్ణానికి సంబంధించిన దస్త్రాలు కూడా ఉన్నాయి. రానున్న రెండు మూడు ఏళ్లలో రహదారుల విస్తీర్ణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి  మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో జరిగిన నిర్మాణాలపైనా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవని పేర్కొన్న మంత్రి కోమటిరెడ్డి.. కొత్త సెక్రెటేరియట్, అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణాల్లో అక్రమాలపై చర్యలు ఉంటాయని అన్నారు. ఒకరిద్దరు ఆఫీసర్లు అప్పట్లో టెండర్లు పిలిచిన విధానంపై రాష్ట్ర ప్రభుత్వ విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త కౌన్సిల్ భవన నిర్మాణానికి సీఎం ఆదేశించారనీ, త్వరలో కొత్త కౌన్సిల్ భవన నిర్మాణం చేపడతామన్నారు. పాత భవనం ఆవరణలోనే ఏర్పాటునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సీఎల్పీ కార్యాలయాలు కూల్చి కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పారు. రహదారుల నిర్మాణమే తమ ప్రధమ ప్రాధాన్యత అని చెప్పారు.

రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కోరతానని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. ప్రాంతీయ రింగ్ రోడ్డు సౌత్ ను జాతీయ రహదారిగా గుర్తించాలని కోరతానని తెలిపారు. అలాగే విజయవాడ – హైదరాబాద్ రహదారిని ఆరు లైన్లకు, హైదరాబాద్ –కల్వకుర్తి నాలుగు లైన్లకు, సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ ఫ్రాక్ట్రక్చర్ ఫండ్ ని పెంచాలని కోరతానని చెప్పారు. తొమ్మిది దస్త్రాల్లో అయిదింటి అనుమతి కోసం సోమవారం గడ్కరీని కలుస్తానని తెలిపారు.

హైదరాబాద్ – విజయవాడ రహదారిలో మల్కాపూర్ వరకూ కొంత పని అయిపోయిందనీ, ఆరు నెలల్లో దానిని పూర్తి చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ – విజయవాడ రహదారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రెండు గంటల్లో విజయవాడ చేరుకునేలా విస్తరిస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. నల్లగొండ నియోజకవర్గంలో వంద కోట్ల వ్యయంతో నల్లగొండ – ముషంపల్లి – ధర్మవరం వరకూ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేస్తామనీ, వారం రోజుల్లో టెండర్లను పిలవడం జరుగుతుందని చెప్పారు. తన భువనగిరి ఎంపీ పదవికి సోమవారం రాజీనామా చేస్తానని వెల్లడించారు కోమటిరెడ్డి.

Telangana BJP: బీజేపీలో ఆసక్తికరంగా ప్లోర్ లీడర్ ఎంపిక వ్యవహారం .. పార్టీలో మల్లగుల్లాలు

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju