TS News: జన జీవన స్రవంతిలోకి ఆ మహిళా మావోయిస్టు నేత..!!

Share

TS News: మూడు నెలల క్రితమే అనారోగ్యంతో మృతి చెందిందని భావించిన ఓ మవోయిస్టు మహిళా నేత పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు తెలంగాణ కార్యదర్శిగా పని చేసిన హరిభూషణ్ భార్య బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క శుక్రవారం ఉదయం డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. శారదక్క స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా గంగారం. పీపుల్స్ వార్  పార్టీకి ఆకర్షితురాలైన ఆమె 1994లో అజ్ఞాతంలోకి వెళ్లారు.

TS News: surrender of maoist women leader sharadakka
TS News: surrender of maoist women leader sharadakka

ప్రస్తుతం శారదక్క జిల్లా కమిటీ సభ్యురాలిగా పని చేస్తున్నారు. గతంలో చర్ల – శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేశారు. శారదక్క భర్త మావోయిస్టు నేత హరిభూషణ్ ఈ ఏడాది జూన్ 21న కరోనా బారిన పడి మృతి చెందారు. ఆ సమయంలో శారదక్క కూడా కరోనా బారిన పడి మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే కరోనా నుండి కోలుకున్నా అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో శుక్రవారం డీజీపీ ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. శారదక్క లొంగుబాటుకు సంబంధించిన వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డి ఈ మధ్యాహ్నం మీడియాకు వెల్లడించనున్నారు.

Read More:

1. AP SEC: జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎప్పుడంటే.. ?

2. Justice Kanagaraj: జస్టిస్ కనగరాజ్‌కు ఇచ్చిన రెండవ పదవీ పాయె..!!

3.Pawan Kalyan: ప్రధాన మంత్రి మోడికి థ్యాంగ్స్ చెప్పిన పవన్ కళ్యాణ్..! ఎందుకంటే..?

 


Share

Related posts

Shruthi Selvam latest photos in saree

Gallery Desk

Assembly Elections : ఆ అయిదు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

somaraju sharma

నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న నాని సినిమా..!!

sekhar