Breaking: టీఎస్పీఎస్సీ గ్రూప్ – 2 పరీక్ష వాయిదాపై ఎట్టకేలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29, 30న జరగాల్సిన గ్రూప్ – 2 పరీక్ష నవంబర్ కు వాయిదా వేసింది. గ్రూప్ – 2 పరీక్ష రీషెడ్యూల్ చేయాలని గురువారం టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అభ్యర్ధులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవేళ గ్రూప్ – 2 పరీక్ష రీ షెడ్యూల్ గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తో సీఎం కేసిఆర్ చర్చించారు.

టీఎస్పీఎస్సీ తో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ కు సూచించారు. లక్షలాది మంది విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో విడుదల చేసే నోటిఫికెషన్ల విషయంలోనూ అభ్యర్ధులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎస్ కు కేసిఆర్ సూచించారు. అభ్యర్ధులు పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి తో చర్చించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.