NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TSPSC: గ్రూప్ 2 పరీక్షలు వాయిదాకై అభ్యర్ధుల ఆందోళన ..కమిషన్ కీలక ప్రకటన

Advertisements
Share

TSPSC: గ్రూప్ – 2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్ధులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో  టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రూప్ 2 పరీక్షలను మూడు నెలల వరకూ వాయిదా వేసి తమకు న్యాయం చేయాలని అభ్యర్ధులు డిమాండ్ చేశారు.  ప్రభుత్వం దిగి వచ్చే వరకూ ఆందోళన విరమించబోమని పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద భైటాయించారు. అభ్యర్ధుల ఆందోళనకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మద్దతు తెలియజేశారు.

Advertisements

గురుకుల, ఇతర నియామక పరీక్షలు ఉన్నందున ఈ నెల 29,30వ తేదీల్లో తలపెట్టిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై హైకోర్టులో 150 మంది గ్రూప్ 2 అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.  పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్ధులు టీఎస్పీఎస్సీ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో అధికారులు రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి తమను కలిసిన ప్రతినిధి బృందాన్ని పంపినట్లు సమాచారం. మరో వైపు అభ్యర్ధుల ఆందోళన నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. గ్రూప్ 2 అభ్యర్ధుల బృందానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి హామీ ఇచ్చారన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ స్పందించింది. పరీక్ష వాయిదాపై తాము ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. బంధువులు చనిపోవడంతో ఆ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఉన్నారని తెలిపింది. అభ్యర్ధులు అసత్య ప్రచారాలు నమ్మవద్దని కమిషన్ కోరింది.

Advertisements

అంతకు ముందు గ్రూప్ 2 వాయిదా వేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రూప్ 2 అభ్యర్ధులు భారీ సంఖ్యలో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న అభ్యర్ధులపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనను అడ్డుకుంటున్న పోలీసులపై కొంత మంది అభ్యర్ధులు దాడికి దిగడంతో పోలీసులు, అభ్యర్ధుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న టీజేఎస్ నేతలను, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియంకు తరలించారు. దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియంకు తరలించారు.

గోషామహల్ స్టేడియంలో తమను బంధించారంటూ అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. అలాగే గోషామహల్ స్టేడియంలో ఉన్న అభ్యర్ధులను వెంటనే విడుదల చేయాలంటూ టీఎస్పీఎస్సీ ముందు మరి కొంత మంది అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే పోలీసులు అనైతికంగా ప్రవర్తిస్తున్నారంటూ అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేశారు.  అభ్యర్ధులు ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా టీఎస్సీపీఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అభ్యర్ధులు ఆందోళన కొనసాగిన నేపథ్యంలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు .. ఆందోళన విరమించకపోతే అరెస్టు చేస్తామని కూడా హెచ్చరించారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పలువురు అభ్యర్ధులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

ఏపీ రాజకీయ నేతలకు, ప్రజలకు రేణు దేశాయ్ కీలక వినతి.. సెల్ఫీ వీడియో విడుదల..మంత్రి అంబటి స్పందన ఇలా..


Share
Advertisements

Related posts

Radhe Shyam : ఏంటి ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసం అంత ఖర్చు అయ్యిందా – ప్రొడ్యూసర్ ఏమైపోతాడు ? 

arun kanna

‘లింగమనేనికి ఆర్‌కె సవాల్!’

somaraju sharma

Intinti Gruhalakshmi: శశికళకు తులసి ఇల్లు అమ్మేసిందా.!? భాగ్య, లాస్య ప్లాన్ తూచ్..!? ప్రేమ్ కెరీర్ ఎటు..!

bharani jella