NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

ఉదయం కిడ్నాప్ …మధ్యాహ్నం పెళ్లి .. తండ్రికి షాక్ ఇచ్చిన కుమార్తె

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడవల్లి గ్రామంలో శాలిని అనే యువతి కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కిడ్నాప్ అంతా ఓ పెద్ద డ్రామా అని తర్వాత తేలిపోయింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ యువతీ యువకుడు కిడ్నాప్ డ్రామా ఆడారు. తండ్రికి బిగ్ షాక్ ఇచ్చింది షాలిని. గ్రామానికి చెందిన శాలిని అనే యువతి తన తండ్రితో కలిసి మంగళవారం వేకువజామున గ్రామంలో హనుమాన్ ఆలయంలో పూజ చేయడానికి వెళ్లింది. గుడిలో పూజల అనంతరం తండ్రితో కలిసి బయటకు రాగా ఆ యువతిని కిడ్నాప్ చేసేందుకు ఆలయం వద్ద అప్పటికే కొందరు యువకులు యువతి తండ్రిని పక్కకు తోసి వేసి శాలిని ని బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకువెళ్లారు.

Girl Kidnapped by Unknown Persons in Rajanna Siricilla

 

ఈ ఘటనతో ఒక్క సారిగా నిచ్చేష్టుడైన యువతి తండ్రి.. కారును ఆపేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. వెంటనే కారును పట్టుకునేందుకు బైక్ పై అనుసరించినా కారు వేగంగా వెళ్లిపోయింది. దీంతో ఆ యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా నిందితులను గాలించే పనిలో పోలీసులు పడ్డారు. తన కుమార్తె కిడ్నాప్ వెనుక గ్రామానికి చెందిన కటారపు జాన్ ప్రమేయం ఉండవచ్చని శాలిని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయం వద్ద సీసీ టీవీ పుటేజ్ లో యువతిని కిడ్నాప్ చేయడం స్పష్టంగా రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Shalini Jani

అయితే కిడ్నాప్ కు గురైన యువతి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆ యువతి తాము వివాహం చేసుకున్నట్లుగా వీడియో విడుదల చేసింది. తాము ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని తెలిపింది. తాను ప్రేమించిన యువకుడు జ్ఢానేశ్వర్ అలియాస్ జాని దళితుడు కాబట్టే తమ ఇంట్లో వివాహానికి ఒప్పుకోవడం లేదని శాలిని చెప్పింది. పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరనే కిడ్నాప్ ప్లాన్ చేసినట్లుగా వెల్లడించింది. ఏడాది క్రితమే తాము ఇంట్లో నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నామనీ అయితే అప్పుడు తాను మైనర్ ను కావడం వల్ల పెళ్లి చెల్లలేదనీ, తన తల్లిదండ్రుల ఫిర్యాదుపై అప్పుడు జాని పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. ఇప్పుడు తనకు మైనార్టీ తీరడంతో ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామనీ, ఎవరి బలవంతం లేదని ఆమె తెలిపింది. తన తల్లిదండ్రుల నుండి ప్రమాదం ఉన్నందున పోలీసులు రక్షణ కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వీడియోను విడుదల చేసింది. దీంతో కిడ్నాప్ ఉదంతం సుఖాంతం అయ్యింది.

దటీజ్ విజయసాయి అనాల్సిందే(గా)..! మరో సారి రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ గా అవకాశం..

Shalini Jani Wedding

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju