NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Road Accident: డివైడర్ ను ఢీకొని కారు పల్టీ కొట్టింది.. ఆ వెంటనే చెలరేగిన మంటలు.. ఇద్దరు మృతి, మరో ముగ్గురుకి గాయాలు..

Road Accident:  హైదరాబాద్ – విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై నకిరేకల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల బైపాస్ జంక్షన్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద ధాటికి ఆ వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ప్రజలు చూస్తుండగానే పెద్ద ఎత్తున మంటల వ్యాపించాయి. ఇది గమనించిన వాహనదారులు అధికారులు వచ్చే వరకూ వేచి ఉండకుండా వెంటనే స్పందించి కారులో ఉన్న అయిదుగురుని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

Road Accident

 

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫణి కుమార్, అతని తల్లి కరుణ మరణించగా, ఫణికుమార్ భార్య కృష్ణవేణి, ఆయన కుమార్తె, మరొకరు చికిత్స పొందుతున్నారు. బాధితులు అందరూ సూర్యపేట జిల్లా కేంద్రం విద్యానగర్ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. వీరు హైదరాబాద్ నుండి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తొంది. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయినప్పటికీ కారు మొత్తం దగ్ధం అయ్యింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి కుమారుడు మృతి చెందడం, మరో ముగ్గురు గాయపడటంతో విద్యానగర్ కాలనీలో విషాదశ్చాయలు అలుముకున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju