Vanama Raghava: వనమా రాఘవ కేసులో: దిమ్మతిరిగే ట్విస్ట్ – ఏపి తెలంగాణ ప్రజలతో పాటు పోలీసులూ దెబ్బతిన్నారు..!

Share

Vanama Raghava: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇటీవల జరిగిన రామకృష్ణ కుటుంబ బలవన్మరం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే తనయుడు కావడంతో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునే ముందు రామకృష్ణ తీసిన సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిందితుడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు ను తెలుగు రాష్ట్రాల్లో తిట్టని వారు అంటూ ఎవరూ ఉండరు.

Vanama Raghava case news twist
Vanama Raghava case news twist

Vanama Raghava: రాఘవేంద్ర అరాచకాలు ఒక్కటొక్కటిగా

ఎట్టకేలకు పోలీసులు రాఘవేంద్రను అరెస్టు చేశారు. రాఘవేంద్ర అరాచకాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఇదే అవకాశంగా అధికార పార్టీ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్నారు. రాఘవ దురాగతంపై రామకృష్ణ చెప్పిన మాటలతో సభ్యసమాజం మొత్తం రాఘవేంద్రను తప్పుబడుతుండగా.. చనిపోయిన కొడుకు పట్ల తల్లి, ఆయన సొంత సోదరి చెడుగా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాఘవేంద్రకు రామకృష్ణ సోదరి మాధవితో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లనే మానవత్వం అనేది కూడా లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేశారని ప్రజలు అనుకుంటున్నారు.

రాఘవపై రౌడీ షీట్

ఈ నెల 3వ తేదీన రామకృష్ణ అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందనో లేక ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే క్లూస్ టీమ్ రామకృష్ణ కారు తనిఖీ చేయగా కీలక పత్రాలు, సూసైడ్ నోట్ వెలుగు చూసాయి. అతని సెల్ ఫోన్ లోని సెల్ఫీ వీడీయో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎమ్మెల్యే తనయుడు రాఘవ అజ్ఞాతనంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు రాఘవపై కేసు నమోదు చేసి అతని ఆచూకీ కోసం ఎనిమిది పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో టీఆర్ఎస్ అధిష్టానం అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఎట్టకేలకు పోలీసులు రాఘవను రాష్ట్ర సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ వైపు వెళుతుండగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చారు. మెజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. మరో పక్క రాఘవ దురాగతాలపై ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తుండటంతో పోలీసు అధికారులు అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయనున్నట్లు ప్రకటించారు.

Read More: 1. AP DGP: ‘ఒక్కొక్కడినీ వదిలే ప్రసక్తే లేదు’ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి..!

2. Chandrababu: చంద్రబాబుకు వచ్చిన సరికొత్త కష్టం చూసి జగన్ కూడా అయ్యో పాపం అనుకున్నాడు..!

3. RRR: ‘ఆ ఒక్క సర్వే’ చూసుకుని రెచ్చిపోతున్న రాజు గారు, నరసాపురం గెలుపు గ్యారెంటీ అని తెల్చిన నేషనల్ సర్వే?


Share

Related posts

YSRCP: కుమారుడుకి నామినేటెడ్ పదవి..! ఆ సీనియర్ నేతకు మొండి చేయి..!!

somaraju sharma

కోడి గుడ్డు పెంకులతో ఇంటి గార్డెన్’లో ఇలా చేస్తే ఎన్ని లాభాలో తెలుసా?

Teja

RRR: ఇండియాలో కాక ఇంటర్నేషనల్ స్థాయిలో “RRR” ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుందో తెలుసా..??

sekhar