Vanama Raghava: రియల్ లైఫ్ కాలకేయ.. వనమా రాఘవ..!

Share

Vanama Raghava: వనమా రాఘవేంద్రరావు అకృత్యాలు ఒక్కోటి వెలుగులోకి వస్తుంటే.. సినిమాల్లో విలన్ రియల్ గానూ ఉన్నాడని చెప్పాలి. సెటిల్ మెంట్లు, రౌడీయిజం, బెదిరింపులు, దౌర్జన్యం.. ఇప్పుడు ఏకంగా ఓ కుటుంబం ఆత్మహత్యకు కారణమయ్యాడు. రామకృష్ణను బెదిరించింది నిజమే అని ఒప్పుకున్న రాఘవ ప్రస్తుతం సబ్ జైలులో ఉన్నాడు. పాల్వంచ అనే చిన్న పట్టణంలో ఓ మినీ మాఫియానే సృష్టించుకున్నాడు. రాఘవ చీకటి సామ్రాజ్యం ఇన్నాళ్లూ వెలుగులోకి రాకపోవడానికి వ్యవస్థల్లో ఉన్న లోపం కూడా ఓ కారణమని చెప్పాలి. తండ్రి అధికారంతో తాను పెత్తనం చెలాయిస్తూ.. తానేం సాధించాడో, ఎందుకిదంతా చేస్తున్నాడో తెలీని అజ్ఞానంతో ఇప్పుడు అంధకారంలో కూరుకుపోయాడు.

vanama raghava real life villainism
vanama raghava real life villainism

బయటకొస్తున్న బాధితులు..

రామకృష్ణ సెల్ఫీ వీడియో లేకపోతే.. ఈ దారుణం కూడా కాలగర్భంలో కలిసిపోయేదేమో..! ఇప్పుడు పోలీసులు అలెర్టై (Vanama Raghava) రాఘవను అరెస్టు చేశారు. అనుచరులు గిరీశ్, మురళి, శ్రీనివాస్, రమాకాంత్ లను అరెస్టు చేసి రాఘవ అక్రమాలపై ఆరా తీస్తున్నారు. పాల్వంచకు చెందిన ఓ ఫైనాన్షియర్ గతేడాది ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి సూసైడ్ నోట్ ప్రకారం.. రాఘవ విచారణకు రావాలంటూ ఆయన ఇంటికి ఇప్పుడు నోటీసులు అంటించారు. రాఘవ బాధితులెందరో బయటకొస్తూ తమ బాధ చెప్పుకుంటున్నారు. తమ స్థలాన్ని రాఘవ అనుచరులు కబ్జా చేశారని.. తనపై దాడి చేశారని పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోనందున ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు ఓ బాధితురాలు పేర్కొంది. మూడు దశాబ్దాల క్రితమే 1991లోనే ఓ మిల్ కార్మికుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడని.. రాఘవపై ఆరోపణలు ఉన్నాయి.

ఎన్నెన్నో దారుణాలు..

ఓ వ్యక్తికి శిరోముండనం, మహిళపై అత్యాచార ఆరోపణలు, గిరిజన మహిళపై దాడి ఆరోపణలు కూడా రాఘవపై ఉన్నాయి. రియల్ ఎస్టేట్ దందా, ప్రైవేట్ పంచాయితీలు, సెటిల్ మెంట్లు నిత్యకృత్యాలని తెలుస్తున్నాయి. ప్రభుత్వ భూములనూ వదలని రాఘవేంద్ర, అతని బినామీలపై వందల రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలుస్తోంది. మొత్తంగా నియోజకవర్గంలో (Vanama Raghava) తన నీడ లేకుండా ఏ పనీ జరగనంతగా శాసించాడని తెలుస్తోంది. ఉద్యోగుల పోస్టింగులు, ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలు, ఇసుక.. ఇలా ప్రతీది తన కనుసన్నల్లో ఉండాల్సిందే.. సొమ్ములిచ్చుకోవాల్సిందే. ఒకరకంగా కొత్తగూడెం నియోజకవర్గంలో డాన్ గా చెలామణీ అయ్యాడు. ఇప్పటికైనా రాఘవ బాధ తమకు తప్పుతుందనే మాటలు పట్టణంలో చక్కర్లు కొడుతున్నాయట..!

 


Share

Related posts

మృత్యు స్లీపర్లు వాపస్

Kamesh

‘ఈడి’కి అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు!?

somaraju sharma

ఛానళ్ల తీరు సిగ్గుచేటు!

Siva Prasad