NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కబడ్డీ ఆడి యువకులను ఉత్సాహపర్చిన ఎమ్మెల్యే సీతక్క.. వీడియో వైరల్

సంక్రాంతి పండుగ వేళ గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించడం జరుగుతుంటుంది. మహిళలకు ముగ్గుల పోటీలతో పాటు కబడ్డీ, క్రికెట్ తదితర పోటీలను నిర్వహించి నిర్వహకులు బహుమతులు అందజేస్తుంటారు. యువతీ యువకులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొంటుంటారు. గోదావరి జిల్లాల్లో మాత్రం కోడి పందెలు, పేకాట జోరుగా సాగుతుంటుంది. పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలు ఉన్నా అక్కడక్కకడ పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి కోడి పందేలను నిర్వహిస్తుంటారు. ప్రజా ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొంటుంటారు.

MLA Seetakka

 

ఈ క్రమంలో తన సింప్లిసిటిటీతో ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉండి సీతక్కగా పాపులర్ అయిన ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ తన నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు హజరైన ఎమ్మెల్యే సీతక్క..స్వయంగా యువకులతో కబడ్డీ అడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లడుతూ యువత దేశ భవిష్యత్తును మార్చుకోగలుగుతారన్నారు. యువత చెడు అలవాట్లకు బానిసలు కాకూడదని అన్నారు. యువతకు క్రీడలు వారి జీవితంలో భాగం కావాలనీ, తద్వారా వారు జీవితంలో ఒడిదుడుకులను బలంగా ఎదుర్కొంటారనీ పేర్కొన్నారు.

seethakka

 

మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చిన సీతక్క టీడీపీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సీతక్క ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా విజయం సాదించి తొలి సారి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగు పెట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత టీడీపీన ివీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో మమేకం అవుతూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

ఏపిలో పెట్టుబడులు గత టీడీపీ హయాంలో కంటే వైసీపీ ప్రభుత్వంలోనే ఎక్కువ .. ఇదీ లెక్క

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!