NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

నియంత చర్యలు .. చట్టాలు పనిచేయవిక్కడ!! కెసిఆర్ వెనక్కు తగ్గింది ఇందుకే

ప్రజాస్వామ్య దేశంలో ఎలాంటి నియంతృత్వ చట్టాలు, విధానాలు, వ్యక్తిగత అంశాలు సైతం పనిచేయవు.. దాన్ని గుర్తించడానికి వేలాది పుస్తకాలు చదివిన కెసిఆర్ కు సంవత్సహరం పట్టింది… ఒక ఏడాది పంట లు నష్టపోయిన తర్వాత గాని అసలు విషయం బోధపడలేదు… లేక ఢిల్లీ దెబ్బ తో మాట మార్చారో తెలియదు గాని…. ఢిల్లీ పర్యటన నుంచి రాగానే కెసిఆర్ తీసుకున్న నిర్ణయం… అయన వెనక్కు తగ్గినా నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది.. అదే నిర్బంధ వ్యవసాయ విధానం… పేరులోనే నిర్బంధం నింపుకున్న ఈ విధానాన్ని తెలంగాణాలో గత ఏడాది ప్రవేశ పెట్టారు.. ఇప్పుడు దీన్ని తొలగించారు… అసలు ఎందుకు కెసిఆర్ వెనక్కు తగ్గారు..? అసలు కెసిఆర్ తీసుకొచ్చిన విధానంలో ఎలాంటి లోపాలు ఉన్నాయి… ఆయన వెనక్కు తగ్గడానికి ఎలాంటి అంశాలు దోహదం చేశాయో ఒకసారి పరిశీలిస్తే…


1 .. నిర్బంధ వ్యవసాయ విధానం అంటే రైతు తనకు నచ్చిన పంట పండించుకోవడానికి లేదు. ప్రభుత్వం నిర్ణయించిన పంటలనే వేయాలి.. అప్పుడే ప్రభుత్వం దానికి తగిన గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుంది.. అంటే ప్రభుత్వం వెయ్యమన్న పంటను రైతులు వేస్తేనే ప్రభుత్వం కొంటుంది అన్న మాట… అప్పటి మార్కెట్ లో ఏది ఎక్కువ డిమాండ్ ఉంటె ఆ పంటను రైతులతో ప్రభుత్వం వేయించి డిమాండ్ కు అనుగుణంగా ధర ఇప్పంచాలి అనేది.. లాభం తీసుకోవాలి అనేది కాన్సెప్ట్…
** విఫలం ; దీనికి తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి నేల ఉంది.. ఎలాంటి పంటలు పండించుకునే వెసులుబాటు ఉంది అనేదానిపై మొదట సమగ్ర సర్వే జరగాలి. ఒక విధానపరమైన వ్యవసాయ కెపాసిటీ ఎంత ఉంది రాష్ట్రానికి అన్నది ప్రభుత్వం దగ్గర ఉండాలి.. ఇదంతా ముందుగా జరిగిన తర్వాత మాత్రమే విధానం అమలు చేయాలి. నీళ్లు , నేల స్వభావం, అది ఎలాంటి పంటలకు అనువుగా ఉంటుంది..? మార్కెట్ డిమాండ్ అంచనా.. పంట కొనుగోలు దగ్గర నుంచి దాన్ని అమ్మే వరకు ఎం చేయాలి అనే సమగ్ర ప్రణాళిక లోపం కనిపించింది.
2 . అసలు డిమాండ్ ఎక్కడున్నా అక్కడికి తరలించేలా.. దానికి తగిన పంటలను వేయిస్తేనే లాభాలు సాధ్యం. రైతు సుదూర ప్రాంతాలకు పంటను తరలించలేకపోయిన ప్రభుత్వాలు ఆ పని చేయగలవు.. అయితే దేశవ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఉన్న పంటలు అపరాలు.. అంటే కందిపప్పు, మినప, సెనగలు, పెసలు ఇవన్నీ అన్న మాట. దీనికి ఎంతో డిమాండ్ ఉంది. అలాగే నూనె ఉత్పత్తులకు మంచి అవసరం ఉంది.
** విఫలం ; తెలంగాణాలో గత ఏడాది మొక్కజొన్న సాగును ప్రభుత్వం వేయించింది. దాని తర్వాత సన్న బియ్యం.. వరి, పత్తి పంటకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. వరి విషయంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ద్వారా పంట కొంది. అసలు ఈ బాధ్యత ఎఫ్ సి ఐ ది. లేవి సేకరణ అంత వారిదే. అలాంటప్పుడు దీనిలో ప్రభుత్వ సాయం అనవసరం.. ఇక మొక్కజొన్న సేకరించిన తెలంగాణ ప్రభుత్వం తర్వాత మార్కెట్ డిమాండ్ లేకపోవడంతో నష్టపోయింది.


3 . సాగుచేసిన వారికీ కాకుండా కౌలు చేసిన వారికీ కాకుండా ఎక్కడో ఉంటున్న వారికీ రైతు బందు ఇవ్వడం సైతం అన్నదాతల కోపానికి కారణం అయ్యింది. ప్రభుత్వం చెప్పినట్లుగా నడుచుకుంటున్న వారికీ సరైన ప్రాధాన్యం దక్కకపోవడం ఆగ్రహానికి కారణం అయ్యింది. ఇక  ధర విషయంలో సైతం దళారులు.. నాయకులూ చేసిన మోసాలు ఎక్కువ అయ్యాయి. ఇక సన్నబియ్యం కొని ధర ఇచ్చే విషయంలో సైతం ప్రభుత్వం తీరు మీద రైతులు గుర్రుగా ఉన్నారు. దింతో ఇదంతా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది అని గ్రహించిన కెసిఆర్ విధానం… గోదానం బర బార్ బందు చేసినం అని ప్రకటించాడు…
అయితే మొత్తం రైతులకే వదిలేశాం.. మార్కెట్ కమిటీలు ఎత్తేస్తాం అని చెప్పడం వాళ్ళ కెసిఆర్ మీద మరింత కోపం ఇప్పుడు పెరిగే ప్రమాదం ఉంది.. మీకు స్వేచ్ఛ ఇచ్చాను అని చెప్పుకోవడంతో పాటు… అవసరం అయితే చేదోడుగా నిలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఉంటె ఇంకా కెసిఆర్ కు ఒక పాజిటివ్ వచ్చి ఉండేది.

 

author avatar
Comrade CHE

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N