తెలంగాణలో సంచలనం రేపిన నవీన్ హత్య కేసులో ఒక కీలక అప్ డేట్ వెల్లడైంది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సీన్ రికన్‌స్ట్రక్షన్ పూర్తి చేశారు. ఈ కేసులో హరిహర కృష్ణ ప్రేమించిన యువతి ప్రమేయం ఉందా లేదా అనే దానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. దీనిపై రొచకొండ సీపీ డీఎస్ చౌహన్ క్లారిటీ ఇచ్చారు. తాను ప్రేమించిన యువతి తన స్నేహితుడితో చనువుగా ఉంటుందన్న కక్షతో నవీన్ ను హరిహర కృష్ణ అత్యంత పాశవికంగా హత్య చేసి తల, మొండెం వేరు చేసి, వేళ్లు కత్తిరించి, గుండె బయటకు తీసి సైకోలా ప్రవర్తించాడు. ఈ ఘటన తర్వాత ఆతను ప్రేమించిన యువతికి మెసేజ్ చేశాడు. దీంతో ఆ యువతికి ఏమైనా ఈ కేసులో సంబంధం ఉందా అనే అనుమానాలు వచ్చాయి. ఆ దిశగానూ పోలీసుల దర్యాప్తు చేశారు.

అయితే హత్యలో ఆ యువతి పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదంటూ సీపీ క్లీన్ చిట్ ఇచ్చారు. నవీన్ హత్య కేసులో యువతికి ఎలాంటి సంబంధం లేదని సీపీ చౌహాన్ స్పష్టం చేశారు. నిందితుడు హరిహర కృష్ణ నుండి మరిన్ని వివరాలు రాబడుతున్నామనీ, అతనికి సహకరించిన వారిపైనా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నిందితుడిలో పశ్చాత్తాపం ఏ మాత్రం కనిపించడం లేదని, అతను జైలులో ప్రశాంతంగా గడిపాడని సమాచారం. పోలీసుల ప్రశ్నలకు హరిహరకృష్ణ తడబాటు లేకుంటా సమాధానాలు చెప్పాడుట. తాను ఒక్కడినే హత్య చేశానంటూ పదేపదే చెబుతున్నాడని తెలుస్తున్నది. ఈ నెల 9 వరకు నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీన్ రీకన్‌స్ట్రక్షన్ పూర్తి చేశారు పోలీసులు.
కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు .. కవిత రేపో మాపో జైలుకి అంటూ..
Congress: కాంగ్రెసులో ఉడకని ప్రశాంత్ కిశోర్ పప్పులు!అంతా నా ఇష్టం అన్న వ్యూహకర్త!కుదరదు పొమ్మన్న అధినేత!