తెలంగాణ‌ న్యూస్

మేఘాపై మరో సారి ఫైర్ అయిన వైఎస్ షర్మిల .. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై విచారణకు గవర్నర్‌కు ఫిర్యాదు

Share

కేసిఆర్ సర్కార్, మేఘా కృష్ణారెడ్డిలపై మరో సారి ఫైర్ అయ్యారు వైఆర్ఎస్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ సారి ఏకంగా గవర్నర్ తమిళిసై ని కలిసి ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో కేసిఆర్ సర్కార్ దాదాపు 90 శాతం కాంట్రాక్ట్ పనులను మేఘా కృష్ణారెడ్డికే ఇస్తున్నారనీ, ఆయన కేసిఆర్ భాగస్వామి అంటూ ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే అంశంపై గవర్నర్ తమిళి సై అపాయింట్మెంట్ తీసుకుని కలిసి ఫిర్యాదు చేశారు. గవర్నర్ కలిసిన తరువాత షర్మిల మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మూడేళ్లలోనే మునిగిపోయిందని అన్నారు షర్మిల. అద్భుతం అయిన ప్రాజెక్టు అధ్బుతం అయిన అబద్దంగా నిరూపితం అయ్యిందన్నారు. 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి 55 వేల ఎకరాల కు మాత్రమే నీళ్లు ఇచ్చారన్నారు. లక్షల కోట్ల ప్రాజెక్టు 55 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికా అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ఈ ప్రాజెక్టు వల్ల వేల కోట్లు కరెంటు బిల్లులు కడుతున్నారనీ, వేల కోట్ల అప్పుకు వడ్డీ కడుతున్నారని విమర్శించారు.

 

ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో వేల ఎకరాలు ముంపుకు గురయ్యయనీ,  ఎంతో మంది ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. లక్షల్లో నష్టం జరిగితే పది వేలు ఇస్తామని చెప్పారనీ, నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఆ చిన్న మాట కూడా నిలబెట్టుకోలేదని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ హయాంలో నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు 18 ఏళ్లు అయినా ఈనాటికీ చెక్కు చెదరలేదని గుర్తు చేశారు. 30 లక్షల వరద నీరు వచ్చినా దేవాదుల తట్టుకుని నిలబడిందనీ, కానీ 29లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడలేదని విమర్శించారు. ఇందుకు నాశిరకం పనులే కారణమని ఆరోపించారు. పట్టపగలు తెలంగాణ సొమ్మును దోచుకు తింటున్న దుర్మార్ఘులు కేసిఆర్, మెగా కృష్ణారెడ్డిలనీ, ఈ పాపం ఊరికే పోదని దుయ్యబట్టారు. ఈ రోజు పూర్తి ఆధారాలతో గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి కూడా మెగా కృష్ణారెడ్డికి అమ్ముడుపోలేదు అనే గ్యారెంటీ లేదన్నారు. రేవంత్ రెడ్డి పిలక కేసిఆర్ చేతిలో ఉందనీ, ఓటుకు నోటు కేసులో ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చని అమ్ముడు పోయాడని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఏటీఎంగా కేసిఆర్ వాడుకుంటున్నారని కేంద్ర మంత్రి ఆరోపించినా ఇక్కడి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు. కేంద్రంలోని బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే ప్రాజెక్టు అని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఆ ఎమ్మెల్యేలు అంతా అధికార పార్టీ సంక నెక్కుతున్నారని విమర్శించారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదన్నారు. ప్రజల పక్షాన నిలబడేది కేవలం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయేనని షర్మిల పేర్కొన్నారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన స్పీకర్ పోచారం


Share

Related posts

Wheat Ravva: గోధుమ రవ్వ ఆహారంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా???

Naina

Clever: వీటిల్లో ఒక్క విషయం మీ లో ఉన్న మీరు తెలివయిన వారేనట!!

Kumar

Social Media Case: సీబీఎన్ ఆర్మీ ప్రతినిధులను స్టేషన్ బెయిల్ పై విడుదల చేసిన పోలీసులు..!!

somaraju sharma