YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ లోని ఆమె నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఆమె బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. దళిత బంధు పథకంలో అక్రమాలు జరిగాయని షర్మిల గజ్వేల్ కు బయలుదేరుతున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. దీంతో షర్మిల ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. షర్మిల గజ్వేల్ వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు ముందుస్తుగానే ఆమె నివాసానికి చేరుకున్నారు. ఆమెను హౌస్ అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో షర్మిల పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు షర్మిల హారతి పట్టి వినూత్నంగా నిరసన తెలియజేశారు.
సీఎం కేసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో దళిత బంధులో అవకతవకలు జరిగాయని ఇటీవల స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారిని కలుసుకునేందుకు వెళ్లాలని అనుకోవడం తప్పా అని షర్మిల ప్రశ్నించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి అనుకోవడం తప్పా అని అడిగారు. కేసిఆర్ పోలీసులు ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఇలా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. పోలీసులు ఉన్నది దొరకు కొమ్ము కాయడానికి కాదని, ప్రజల పక్షాన నిలబడాలన్నారు. కేసిఆర్ నియంత పోకడకు నిరసనగా ఇంటి ముందే నిరాహార దీక్షకు కూర్చున్నారు షర్మిల. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా తీగుల్ గ్రామ ప్రజల కోసం దీక్ష కొనసాగిస్తానని షర్మిల తెలిపారు.
Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్ .. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక .. ఈ జిల్లాల్లో వర్షాలు