NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila : షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా వెనుక కారణం ఇదేనంట..!!

YS Sharmila : దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఉమ్మడి నల్లగొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పర్యటించి క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకుంటానని చెప్పారు. అయితే షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నారని తెలియడంతో తెలంగాణలో వివిధ రాజకీయ పక్షాలు విమర్శలు చేయడం ఆరంభించారు. షర్మిల పార్టీ పెడుతున్నది బీజెపీ కోసమని కొందరు నేతలు, అధికార టీఆర్ఎస్ కు ఉపయోగపడేందుకు అని మరి కొందరు ఆరోపణలు చేస్తున్నారు. అయితే షర్మిల పార్టీ పెట్టడానికి డిసైడ్ అయితే అయ్యారు గానీ పూర్తి స్థాయిలో వివరాలను మీడియాకు వెల్లడించలేదు. ముందుగా అన్ని జిల్లాల నాయకులతో మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోనున్నట్లు తెలిపారు.

YS Sharmila : khammam-tour-postponed
YS Sharmila khammam tour postponed

YS Sharmila : ఎమ్మెల్సీ ఎన్నికల తరువాతే ఖమ్మం పర్యటన ?

ఈ క్రమంలోనే ఈ నెల 21వ తేదీన ఖమ్మం జిల్లాలో పర్యటించాలని ప్రొగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు. షర్మిల ఖమ్మం పర్యటన వివరాలను కొండా రాఘవరెడ్డి ముందుగానే మీడియాకు వెల్లడించారు. లోటస్ పాండ్ నుండి భారీ కాన్వాయ్ తో బయలుదేరి ఖమ్మం పట్టణానికి వెళ్లనున్నారని, అక్కడ భారీ ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతున్నందున షర్మిల పర్యటన వాయిదా వేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. మార్చి 14వ గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరగనున్నది. 17వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు. అంటే షర్మిల పర్యటన దాదాపు నెల రోజులకు వాయిదా పడింది. వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం పెట్టుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు అడ్డుఎందుకు అవుతాయనే మాట కూడా వినిపిస్తోంది. ఇంకేదో కారణం చేత ఖమ్మం పర్యటన వాయిదా వేసుకుని ఉండవచ్చని కూడా అంటున్నారు.

షర్మిల హైదరాబాదులో మీడింగ్ పెట్టిన రోజు ఆమె కార్యక్రమాన్ని సోదరుడు, ఏపి సీఎం వైఎస్ జగన్ కు చెందిన సాక్షి ఛానల్ లో ప్రసారం చేయకపోవడంతో పాటు షర్మిల పార్టీ పెట్టడం సీఎం జగన్ కు ఇష్టం లేదన్నట్లుగా కూడా వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. షర్మిల వ్యక్తిగత నిర్ణయం అని కూడా చెప్పేశారు. ఆ తరువాతనే తాడేపల్లి నుండి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్ కె ) లోటస్ పాండ్ కు వెళ్లి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ తో భేటీ అయి సుదీర్ఘంగా చర్చలు జరిపి వచ్చారు. వారి మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి అనేది బయటకు వెల్లడి అయితే కాలేదు గానీ ఆ తరువాతనే షర్మిల బెంగళూరుకు పయనమయ్యారు. దీంతో కుటుంబ పరంగానూ ఒత్తిడి వస్తుందని అంటున్నారు. మరో పక్క షర్మిల మాత్రం వారంలో ఒక రోజు ప్రత్యేకంగా నాయకులు, ప్రజలతో కలిసే కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా మరి కొద్ది రోజుల్లో షర్మిల పార్టీ, ఇతర విషయాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి ..YS Sharmila : పార్టీ పెట్టకముందరే ప్రభంజనం : బెంగళూరులో స్వీచ్ వేసిన షర్మిల – తెలంగాణలో అతి పెద్ద పరిణామం?

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!