తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

షర్మిల పై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ పోచారంకు ఎమ్మెల్యేల ఫిర్యాదు .. ఫిర్యాదులపై షర్మిల స్పందన ఇది    

Share

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటానని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్పీకర్ పోచారం వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. తనపై చర్యల గురించి ఆలోచించే ముందు వీళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు షర్మిల. విషయంలోకి వెళితే.. పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలపైనా ఆరోపణలు, విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, సి లక్ష్మారెడ్డి లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తమ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై స్పీకర్ పోచారం మంగళవారం రాత్రి స్పందించారు.

YS Sharmila

 

షర్మిలపై తనకు పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన మాట నిజమేనని స్పీకర్ పోచారం తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ గా సభ్యుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటానని పోచారం వెల్లడించారు. స్పీకర్ వ్యాఖ్యలపై షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు.  తనపై చర్యలకు ఆలోచించే ముందు పరాయి మహిళలను అవమాన పర్చిన సంస్కార హీనుడైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారంకు విజ్ఞప్తి చేశారు షర్మిల.

అదే విధంగా సర్కార్ వారి తిట్లు అంటూ ఓ టీవీ ఛానల్ లో ప్రసారమైన వీడియోను షేర్ చేస్తూ.. కేసిఆర్ దొరగారి నోటి నుండి జాలువారిన ఆణిముత్యాలు చూసి విని ఆయన పైన ముందు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువతకు తోడుగా ప్రతి మంగళవారం తాను చేస్తున్న నిరుద్యోగ నిరాహార దీక్షలను వ్రతాలంటూ కించపరుస్తూ వ్యాఖ్యానించిన మరో మంత్రి కేటిఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు వైఎస్ షర్మిల. స్పీకర్ కు షర్మిలపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడం, దానికి ప్రతిగా సీఎం, ఇద్దరు మంత్రులపై చర్యలు తీసుకోవాలని షర్మిల విజ్ఞప్తి చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

రాష్ట్ర విభజన సమస్యలపై 27న కీలక భేటీ .. కేంద్ర హోంశాఖ రూపొందిన అజండా ఇది.. ట్విస్ట్ ఏమిటంటే..?


Share

Related posts

Rajinikanth : బిగ్ బ్రేకింగ్.. తలైవాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..

somaraju sharma

అప్పుల కోసం భూములు తాకట్టు

Siva Prasad

దీపావళి వేళ..! ఆత్మనిర్భర్ భారత్ 3.O …!!

Vissu