25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్

Share

టీఆర్ఎస్ గుండాల నుండి తనకు ప్రాణ హాని ఉందంటూ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల వరంగల్లు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంతో పాటు ఆమె వాహనాన్ని ధ్వంసం చేశారు. శాంతి భద్రతల సమస్య ఉందంటూ ఆమె పాదయాత్రను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి హైదరాబాద్ కు పంపారు. దానిపై నిరనసగా ఆ మరుసటిరోజే ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరగా కారుతో సహా ట్రాఫిక్ క్రేన్ తో పోలీస్ స్టేషన్ కు తరలించి అరెస్టు చేయడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం అయ్యింది. ఇదే క్రమంలో షర్మిల హైకోర్టును ఆశ్రయించగా, పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

YS Sharmila

ఆదివారం మీడియా సమావేశంలో టీఆర్ఎస్ సర్కార్ పై మరో సారి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాహనాన్ని తగులబెట్టి, తమపైనే దాడులు చేసి మళ్లీ తమ వాళ్లపైనే కేసులు పెట్టారని అన్నారు. ప్రజల్లో తమ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు అనుమతి ఇచ్చినా తమ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందనీ, వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకుంటున్నారని అన్నారు. బండి సంజయ్ యాత్ర సజావుగా సాగుతుండగా, తన యాత్రను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ వాళ్లది తాలిబన్ల భాష అని వాళ్ల పార్టీ తాలిబన్ రాష్ట్రసమితి అంటూ విమర్శించారు. పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇస్తామని తెలిపిన షర్మిల.. సోమవారం తన పాదయాత్ర ఉండకపోవచ్చని చెప్పారు. తన పాదయాత్రను అడ్డుకుంటే కోర్టు దిక్కరణ కింద హైకోర్టులో పిటిషన్ వేస్తానని తెలిపారు.

ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు అందుకున్న కేసిఆర్ కుమార్తె కవితపైనా విమర్శలు చేశారు. సీఎం కూతురు కవిత ఆడ మనిషి అయి ఉండి లిక్కర్ స్కామ్ చేస్తారా .. మీ ఇంట్లో మహిళలు లిక్కర్ స్కామ్ లు చేస్తారు అంటూ విమర్శించారు. తాను వ్యక్తిగతంగా దూషణలుచేయలేదన్నారు. 30వేల కిలో మీటర్లు పాదయాత్ర చేసే రాని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వస్తుందని షర్మిల ప్రశ్నించారు.


Share

Related posts

Google Pay : లక్ష రూపాయిల వరకు లోన్ కావాలా? గూగుల్ పే ఉంటే సరిపోతుంది! ఎలాగో తెలుసుకోండి..

Ram

వాళ్లందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న బొత్స ! శభాష్ అన్న జగన్ !!

Yandamuri

TRS BJP: తెలంగాణలో రంజుభళా రాజకీయం..! నిన్న వాళ్లు – నేడు వీళ్లు ఆందోళనలు

somaraju sharma