NewsOrbit
తెలంగాణ‌ రాజ‌కీయాలు

YS Sharmila : వైఎస్ షర్మిల పార్టీ ప్రకటనకు డేట్ ఫిక్స్..! ఎప్పుడంటే..?

YS Sharmila : రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తెలంగాణలో తీసుకురావడం కోసం, ఉద్యమ ఆంక్షలు నెరవేర్చడం కోసం,  కొత్త పార్టీని ఆవిష్కరించబోతున్నామని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూరాబోయే వైఎస్ఆర్ జయంతి జులై 8న పార్టీ పేరు, జండా ప్రకటిస్తామని అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ అవి ఇప్పుడు అమలు అవుతున్నాయా అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్, సున్నా వడ్డీ రుణాలు, రైతు రుణ మాఫీ, పక్కా గృహాలు, ప్రాజెక్టులు, నిరుద్యోగ సమస్య ఇలా అన్ని విషయాలను వివరిస్తూ కేసిఆర్ ప్రభుత్వంలో ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. కేసిఆర్ అవినీతిని ప్రశ్నించడానికి మన పార్టీ అవసరమని అన్నారు షర్మిల.

YS Sharmila speech
YS Sharmila speech

 

“పదవులు వచ్చినా, రాకపోయినా ప్రజల కోసం నిలబడతా, ప్రజల సంక్షేమం కోసం కొట్లాడతా”నని అన్నారు. తనకు అవకాశం ఇవ్వాలో లేదో ప్రజలు నిర్ణయానికి వదిలివేస్తానన్నారు. అవకాశం ఇస్తే ప్రజలకు నమ్మకంగా సేవ చేస్తా, లేకపోతే వారి తరపునే పోరాటాలు చేస్తానని అన్నారు. శివాజీ సినిమాలోని రజనీ కాంత్ డైలాగ్ “సింహం సింగిల్ గానే వస్తుందని అంటూ మేము టీఆర్ ఎస్ చెబితేనో, బిజేపీ అడిగితేనో, కాంగ్రెస్ పిలిస్తే రాలేదు, మూడు పార్టీలకు గురి పెట్టిన బాణంగా వస్తున్నా అని అన్నారు. ఏ ఇతర పార్టీ కింద ఈ పార్టీ పని చేయదు అని అన్నారు. ఇక్కడ ఉన్న పార్టీలు అన్నీ పైకి పోరాడుతున్నట్లు నటిస్తున్నారు కానీ అన్నీ ఓకే తాను ముక్కలే అని షర్మిల విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తానని షర్మిల వాగ్దానం చేశారు. “ఈమె తెలంగాణ కోసం నిలబడుతుందా అనుమానం ఎవరికైనా రావచ్చేమో నేను చెబుతున్నా మాట మీద నిలబడే రాజన్న కూతురుగా చెబుతున్నా ఒక్క చుక్క నీటి బొట్టు కూడా వదులుకోము, తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా అడ్డుకుంటాను, తెలంగాణ ప్రజల కోసం నిలబడతా, కొట్లాడుతా”నంటూ ఆంధ్రప్రదేశ్ పేరు, అన్న వైఎస్ జగన్ పేరు ప్రస్తావించకుండానే ప్రజలకు హామీ ఇచ్చారు. ఇది తెలంగాణ ప్రజల పార్టీ అని ఈ పార్టీకి, సంకల్పానికి ప్రజలు ఆశీస్సులు అందించాలన్నారు. ఈ రోజు కార్యకర్తలే రేపటి నాయకులనీ, అధికార పార్టీకి భయపడకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు అండగా తాను ఉంటానని అన్నారు.

YS Sharmila : ఈ నెల 15 నుండి మూడు రోజుల పాటు నిరాహర దీక్ష

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఈ నెల 15 వ తేదీ నుండి తాను మూడు రోజుల పాటు నిరాహర దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు షర్మిల, ఆ తరువాత జిల్లాల్లో ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యే వరకూ రిలే దీక్షలు కార్యకర్తలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన వైఎస్ విజయమ్మ భావోద్వేగంతో ప్రసంగించారు. తన బిడ్డ షర్మిల ఈ గడ్డకు అంకితం ఇస్తున్నాననీ, దివంగత వైఎస్ఆర్ సంక్షేమ పాలన షర్మిల అందిస్తుందని అన్నారు. ప్రజలు అందరూ షర్మిలను దీవించాలని కోరారు. సభకు వేలాది మంది అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju