NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Vijayamma: విజయమ్మ మాస్టర్ ప్లాన్..! అందరూ ఉద్దండులే..! ఆ మాత్రం ఊహించలేరా..!!

YS Vijayamma: దివంగత ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్థంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ తొలి సారిగా హైదరాబాద్ నోవా టెల్ హోటల్ నందు సంస్మరణ సభ (ఆత్మీయ సమ్మేళనం) ఏర్పాటు చేయడంతో ఇందులో రాజకీయ కోణం దాగి ఉందని చాలా మంది ముందే ఊహించారు. వైెఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఉన్నందున ఈ పార్టీ బలోపేతం చేసేందుకే ఈ సమావేశాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు స్పష్టం అయ్యింది. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నట్లు వివిధ రాజకీయ పార్టీల్లోని వైఎస్ఆర్ సహచరులను,

ఆయన మంత్రివర్గంలో పని చేసిన వారిని విజయమ్మ ఆహ్వానించినప్పటికీ ఈ సమావేశ ఏజండాను అత్యధికులు గ్రహించారు. అందుకే వారు వైఎస్ఆర్ పై అభిమానం ఉన్నప్పటికీ ఆత్మీయ సమ్మేళనం (సంస్మరణ సభ)కు డుమ్మా కొట్టారు. ఈ నాయకులు ఊహించినట్లే వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రసంగాలు జరిగాయి. వైఎస్ఆర్ అభిమానులు ఏపిలో జగన్మోహనరెడ్డి సీఎం అయ్యేందుకు తోడ్పాటు అందించారనీ, అదే విధంగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు కంకణం కట్టుకున్న రాజన్న బిడ్డ షర్మిలకు అండగా వైెఎస్ అభిమానులు, సహచరులు నిలవాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

YS Vijayamma mastar plan meeting
YS Vijayamma mastar plan meeting

వైఎస్ షర్మిల కూడా తను పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, రాష్ట్రంలో పరిస్థితులు వివరిస్తూ తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానంటూ సంస్మరణ సభలో రాజకీయ ప్రసంగం చేశారు. అటు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ఇద్దరూ వైెఎస్ గురించి మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురైయారు. ఈ సంస్మరణ సభ ఉద్దేశాన్ని ముందే గ్రహించిన కాంగ్రెస్ పార్టీ.. పార్టీకి చెందిన వారు ఎవరూ హజరు కావద్దంటూ ఆదేశాలను జారీ చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హజరై వైఎస్ఆర్ పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తాను ముందే వదిన విజయమ్మకు హజరు అవుతానని మాట ఇచ్చాననీ ఆమెకు ఇచ్చిన మాట కోసం వైఎస్ఆర్ సంస్మరణ సభకు హజరైనట్లు చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినప్పటి నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసమ్మతి స్వరాన్ని వినిపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కోమటిరెడ్డి హజరు అవుతారని ఆ పార్టీ నేతలు ముందుగానే ఊహించారు.

ఇక పోతే వైెఎస్ మంత్రివర్గంలో పని చేసిన నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఎక్కువ మంది తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలలో, ఏపిలో వైఎస్ఆర్ సీపీలో కన్ఫర్ట్ గా ఉన్నారు. విజయమ్మ ఆహ్వానాన్ని మన్నించి గానీ, వైెఎస్ పై ఉన్న అభిమానంతో గానీ ఈ సమావేశానికి హజరై ఉంటే షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ టీపీలో చేరే అవకాశం ఉందటూ మీడియాలో వార్తలు వస్తాయి. దీంతో ఆయా పార్టీలో వారికి ప్రాధాన్యత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దాదాపుగా అందరూ సీనియర్ నాయకులే కదా అందుకే ఈ పరిణామాలు ఊహించే వైఎస్ఆర్ పై ఉన్న అభిమానాన్ని మనసులోనే ఉంచుకుని మిన్నకుండిపోయారు. కేవిపి రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, రఘువీరారెడ్డి, జితేందర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ తదితర నేతలతో పాటు వైఎస్ హయాంలో పని చేసిన పలువురు అధికారులు మాత్రం ఆత్మీయ సమ్మేళనంకు హజరైయ్యారు.

1.Toll Issue: టోల్ ఫీజు విషయంలో మాజీ కలెక్టర్ గొడవ..!

2.Komatireddy venkatreddy: కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..! తాను ఏమి పార్టీలో చిన్న పిల్లాడిని కానంటూ..!!

3.friendship: దొంగలతో స్నేహం వారిని ఆలా మార్చేస్తుందేమో..!!

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!