YS Sharmila: పోలీసులపై దౌర్జన్యం చేసిన కేసులో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ ఇవేళకు వాయిదా పడింది. దీంతో ఆమెను నిన్న రాత్రి చంచల్ గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టులో ఈ వేళ మధ్యాహ్నం షర్మిల బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. కాగా జైలులో ఉన్న వైఎస్ షర్మిలను ఆమె తల్లి వైఎస్ విజయమ్మ పరామర్శించారు. కొద్దిసేపు షర్మిలతో మాట్లాడి వెళ్లారు.

పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించేందుకు షర్మిల నిన్న లోటస్ పాండ్ నుండి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులపై వాగ్వివాదానికి దిగారు.. ఆ సమయంలో పోలీసులపై షర్మిల దుసురుగా ప్రవర్తించారు. దీంతో బలవంతంగా అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. అరెస్టు సమయంలో షర్మిల పోలీసులపై చేయి చేసుకోవడం, దానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దీనిపై పోలీసులు తీవ్రంగా పరిగణించి వివిద సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
YS Viveka Case: అవినాష్ బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ