NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Vijayamma: విజయమ్మ ఏం చేయబోతున్నారు..? ఆ మంత్రులకు ఆహ్వానం..!!

YS Vijayamma: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్ విజయమ్మ హైదరాబాద్ లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి  గతంలో వైఎస్ఆర్ మంత్రివర్గంలో పని చేసిన వారిని, వైఎస్ఆర్ కుటుంబ శ్రేయోభిలాషులు, సన్నిహితులను ఆహ్వానిస్తున్నారుట. ఆ మేరకు ఇప్పటికే కొందరికి ఆహ్వానాలు అందాయని ప్రచారం జరుగుతోంది. అయితే 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందగా 2010 నుండి ఇలాంటి కార్యక్రమం నిర్వహించకుండా ఇప్పుడే ప్రత్యేకంగా వైఎస్ విజయమ్మ హైదరాబాద్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.

YS Vijayamma will hold a death anniversary of late chief minister YSR in Hyderabad
YS Vijayamma will hold a death anniversary of late chief minister YSR in Hyderabad

Read More: Thieves Hulchul: సందట్లో సడేమియా..! మంత్రి పర్యటనలో చోరాగ్రేసరుల హస్తలాఘవం..! నేతల జేబులు ఖాళీ..! ఎక్కడంటే..?

ఇప్పటికే వైఎస్ఆర్ కుటుంబంలో రాజకీయ పరమైన విబేధాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అన్న, ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అభిప్రాయానికి భిన్నంగా సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల పులివెందులలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లోనూ వైఎస్ జగన్, వైఎస్ షర్మిల వేరువేరుగా పాల్గొనడం, షర్మిల వెంటనే వైఎస్ విజయమ్మ ఉండటం ప్రజలు అందరూ చూశారు. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించినప్పటి నుండి ఆమె వెన్నంటే వైఎస్ విజయమ్మ ఉన్నారు.

ఏపిలో గతంలో వైఎస్ఆర్‌కు అనుకూలంగా ఉన్న వారిలో మెజార్టీ నేతలు జగన్ పక్షాన అంటే వైఎస్ఆర్‌సీపీలో చేరిపోగా తెలంగాణలో మాత్రం కొంత మంది మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండగా మెజార్టీ నాయకులు అధికార టీఆర్ఎస్, కొందరు బీజేపీలో చేరిపోయారు. అయితే తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత తొలి సారిగా వైఎస్ విజయమ్మ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడంలో రాజకీయ వ్యూహం ఉందని అనుకుంటున్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ బలోపేతం చేయడంలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారా అన్న చర్చ సాగుతోంది.

మాజీ ఎంపిలు కేవిపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తో పాటు నాడు వైఎస్ మంత్రివర్గంలో పని చేసిన మంత్రులకు విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి కాడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 2009 లో వైఎస్ఆర్ మృతి చెందగా ఇప్పటి వరకూ జరిగిన వర్థంతి, జయంతి కార్యక్రమాలకు గతంలో వైఎస్ఆర్ తో కలిసి పని చేసిన వారికి ప్రత్యేకంగా ఆహ్వానించిన దాఖలాలు లేవు. ఓ పక్క ఏపిలోని వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మ తెలంగాణలో షర్మిల పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఈ హోదాలో ఉన్న విజయమ్మ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణలో వివిధ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పాత సహచరులు హజరు అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వైఎస్ విజయమ్మ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మాత్రం సాగుతోంది.

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!