YSR 12th death anniversary: విజయమ్మ పెట్టిన పరీక్ష..! వైఎస్ సహచరుల అంతర్మధనం..!!

Share

YSR 12th death anniversary: రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తనకు పోటీయే లేకుండా చేసుకునేందుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ వ్యూహాత్మక ఆడుగులు వేశారు. ఆ పార్టీ నుండి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ముఖ్యమంత్రిగా కేసిఆర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కొంత మంది కాంగ్రెస్ నేతలు చేరగా, రెండవ సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భవిష్యత్తు లేదనుకున్న వారు అధికార టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. టీఆర్ఎస్ లో చేరడం ఇష్టం లేని డీకే అరుణ లాంటి నేతలు బీజేపీలో చేరిపోయారు. గతంలో వైఎస్ హయాంలో మంత్రులుగా పని చేసిన వారు, వైఎస్ అభిమానులు కూడా ఇతర పార్టీలో చేరిపోయారు. అయితే ఇప్పుడు వారికి ఒక పరీక్ష వచ్చి పడింది.

YSR 12th death anniversary ceremony conduct ys vijayamma
YSR 12th death anniversary ceremony conduct ys vijayamma

వైఎస్ఆర్ 12వ వర్థంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ తొలి సారిగా హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఏర్పాటు చేయడం వరకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి గతంలో వైఎస్ తో సన్నిహితంగా ఉన్న నేతలు, ఆయన మంత్రి వర్గంలో పని చేసిన నాయకులకు ఆహ్వానాలు పంపారు. వైఎస్ విజయమ్మ ఏపిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. మరో పక్క తెలంగాణలో ఆమె తనయ వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ టీపీకి తొలి నుండి మద్దతుగా ఉన్నారు. ఈ తరుణంలో వివిద రాజకీయ పార్టీలో కన్ఫర్ట్ గా ఉన్న వైఎస్ఆర్ సన్నిహితులు, సహచరులకు విజయమ్మ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లాలా వద్దా అన్న మీమాంస ఎదురవుతోంది. ఒక వేళ వైఎస్ పై అభిమానంతో ఆ సమావేశానికి వెళితే ప్రస్తుతం ఉన్న పార్టీని వీడీ వైఎస్ఆర్ టీపీలో చేరే అవకాశం ఉందంటూ  సోషల్ మీడియా లో పుకార్లు షికారు చేస్తాయి. దానికి తోడు తమ పార్టీ నేతలకు సంజాయిషీ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం వైఎస్ఆర్ అభిమానులు తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలో ఉన్నారు. ఆయా పార్టీలో ఉన్న వైఎస్ సహచరులు కొందరు ఇప్పటికే రేపు విజయమ్మ ఏర్పాటు చేస్తున్న వైఎస్ వర్థంతి సభకు వెళ్లాలా వద్దా అనే విషయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. ఇతర పార్టీలో వైఎస్ సహచరులు ఎంత మంది వస్తారో తెలియని పరిస్థితి ఉన్నా షర్మిల పార్టీకి చెందిన నాయకులు మాత్రం హజరయ్యే అవకాశం ఉంది. అదే విధంగా తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టిన తరువాత వైఎస్ఆర్ హయాంలో పని రిటైర్ అయిన కొంత మంది అధికారులు ఆమెను కలిసి మద్దతు తెలియజేశారు. వారు ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉంది.

1.Huzurabad By poll: రూటు మార్చిన కాంగ్రెస్ ..! ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థి ఎంపిక..! కొండా సురేఖకు నో ఛాన్స్..!!.

2.YS Jagan: పార్టీ ప్రక్షాళన – ప్రభుత్వ ప్రక్షాళన..!? జగన్ మదిలో బోలెడు టార్గెట్లు..!

3.Nara Lokesh Vs Kanna Babu: కొడాలి నాని భాషలో లోకేష్ దండకం.. ఘాటుగా అందుకున్న వైసీపీ మంత్రి..!!

 


Share

Related posts

Horoscope : Today Horoscope ఫిబ్రవరి-1- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha

Sahithi Sekhar : సారంగదరియా పాటకు శేఖర్ మాస్టర్ కూతురు డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే?

Varun G

Daily Horoscope జూలై 29 బుధవారం మీ రాశి ఫలాలు

Sree matha