25.7 C
Hyderabad
April 1, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: ఢిల్లీలో వైఎస్ షర్మిల అరెస్టు .. ఎందుకంటే..?

Share

YS Sharmila:  వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను ఢిలీలో పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ సీఎం కేసిఆర్ అవినీతి పాలనపై వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో ఆ పార్టీ శ్రేణులు పార్లమెంట్ మార్చ్ చేపట్టారు. కేసిఆర్ అవినీతిపై జంతర్ మంతర్ వద్ద వైఎస్ షర్మిల ధర్నా నిర్వహించారు. అక్కడ నుండి పార్లమెంట్ కు ర్యాలీగా షర్మిల బయలుదేరారు. వీరి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్ టీపీ శ్రేణులు, పోలీసులకు మద్య తోపులాట జరిగింది.

YS Sharmila Protest

 

ఈ నేపథ్యంలో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్టీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంల నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లో భారీగా అవినీతి జరిగిందనీ, దానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని అన్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కేసిఆర్ దోచుకున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసం రీడిజైన్ పేరుతో భారీ అవినీతి జరిగిందని వ్యాఖ్యానించారు.

YS Sharmila Arrest

 

రూ.38వేల కోట్ల ప్రాజెక్టును లక్షా 50వేల కోట్ల కు పెంచారని, మీడు సార్లు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెంచారని తెలిపారు. ప్రాజెక్టు వల్ల చాలా మంది నిర్వాశ్రయులైయ్యారనీ, వారికి న్యాయం చేయలేదని షర్మిల మండిపడ్డారు.   నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టారనీ, ప్రతి ఏటా వేల ఎకరాలు ముంపునకు గురి అవుతాయని చెప్పారు. ప్రాజెక్టు లో జరిగిన భారీ అవినీతిపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు షర్మిల.

ఎంపీ అవినాష్ వినతిని తిరస్కరించిన సీబీఐ .. నాల్గవ సారి విచారణకు హజరైన అవినాష్ రెడ్డి


Share

Related posts

ఫిబ్రవరి లో స్టార్ట్ అయ్యే స్కూల్స్ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!!

sekhar

తెలంగాణ స్పీకర్‌‌గా శ్రీనివాసరెడ్డి

Siva Prasad

Dowry: ఆ ప్రాంతంలో పెళ్లి చేసుకోవాలంటే ఇంటికి పాములు తెచ్చుకోవాలి ..!

Ram