NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ..వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలతో సహా వైఎస్ షర్మిల అరెస్టు

Share

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణలో విపక్షాల ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల నేడు టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునివ్వడంతో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్దకు షర్మిల వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల రహదారిపై భైటాయించారు. అనంతరం పోలీసులు వైఎస్ షర్మిలను, పార్టీ శ్రేణులను బలవంతంగా పోలీసు జీపులో ఎక్కించుకుని తరలించారు.  దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

YS Sharmila

 

పేపర్ లీక్ కేసును క్లోజ్ చేసేందుకే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని ఆరోపించారు వైఎస్ షర్మిల. పేపర్ లీక్ లో పెద్దల ప్రమేయం లేదని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. “నాకు ఎందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పేపర్ లీక్ కేసులో నా ప్రమేయం ఏమైనా ఉందా” అని షర్మిల ప్రశ్నించారు., కేసులో ఏ సంబంధం లేని నాకు లుకౌట్ నోటీసులు ఇచ్చారంటే ఇంత కంటే నియంత ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉంటారా అని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినట్లే ఇచ్చి .. పేపర్ లీక్ చేయించి పరీక్షలు వాయిదా వేయించి.. ఉద్యోగాలే లేకుండా చేస్తున్నారని విమర్శించారు.

అన్ని రంగాల్లో కేసిఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. అధికారం అడ్డుపెట్టుకుని కేసులు రాకుండా చేసుకుంటున్నారని అన్నారు. తాము నిరసనలు తెలియజేయకుండా ఉండేందుకు ఇప్పటికే రెండు సార్లు హౌస్ అరెస్టు చేశారన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల కుంభకోణంలో సిట్ పెద్ద తలకాయలను వదిలేస్తొందని అన్నారు. ఈ అంశంలో పోరాటానికి అన్ని పక్షాలు కలసి రావాలని పిలుపునిచ్చారు. కాగా ఇవేళ ఎలాగైనా టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించాలని భావించిన షర్మిల పోలీసుల కళ్లు గప్పేందుకు నిన్న సాయంత్రమే లోటస్ పాండ్ లోని తన నివాసం నుండి బయటకు వచ్చారు. రాత్రి ఓ హోటల్ లో బస చేసిన షర్మిల ఈ ఉదయం టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు.

 


Share

Related posts

రెండు క్లారిటీలు: బీజేపీ – జనసేన వాయిస్ ని సరిగ్గా గమనించారా?

CMR

MAA: “మా” అధ్యక్ష ఎన్నికలలో బాలయ్య సపోర్ట్ ఎవరికో తెలుసా..??

sekhar

దీపావళి పండుగకు స్వగ్రామాలకు వెళుతూ తిరిగిరాని లోకాలకు.. 15 కుటుంబాల్లో తీవ్ర విషాదం..మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

somaraju sharma