Children’s Story: కొంత మంది కాళ్లు చేతులు బాగానే ఉన్నా బీక్షాటన (అడ్డుకుని) చేసుకుని ఆకలితీర్చుకుంటూ ఉంటారు. ఈ సమయంలో దానం చేసే వారిలో కొందరు కాళ్లు చేతులు బాగానే ఉన్నాయి కదా.. ఏదైనా పని చేసుకుని బ్రతకవచ్చు కదా అంటూ ఈసడించుకుంటూ ఉంటారు. అయినా వాళ్లు సోమరితనానికి అలవాటు పడి యాచక వృత్తితోనే తమ కడుపు నింపుకుంటూ ఉంటారు. ఇలానే సోమరితంతో అడుక్కుంటూ జీవనం సాగిస్తున్న ఓ నక్కకు కోతి జ్ఞానోదయం అయ్యేలా ఎలా చేసిందో ఈ కథలో తెలుసుకుందాం.
అనగనగా ఒక అడవి ఉంది. అందులో ఉన్న ఒక కోతి కష్టాల్లో ఉన్న జంతువులకు చేతనైన సాయిం చేస్తూ, తనకు ఏదైనా ఆపద వస్తే ఉపాయంతో తప్పించుకుంటూ ఉండేది. ఓ రోజు పక్క అడవిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి కోతి తిరిగి వస్తుండగా, దారిలో దాని కాలికి ముల్లు గుచ్చుకుంది. దాంతో కోతి నడవలేకపోయింది. కుంటుకుంటూ కొద్ది దూరం నడిచే సరికి ఒక చెరవు వచ్చింది. ఈ లోగా చీకటి పడటంతో ఆ చెరువు పక్కనే ఉన్న చింత చెట్టు ఎక్కి రాత్రి నిద్ర పోయింది. ఉదయం మెలుకువ రాగానే నక్క ఒకటి బద్దకంగా నడుస్తూ కనిపించింది. దాని చేతిలో ఒక గుమ్మడి చిప్ప కూడా ఉంది. ఆ నక్క ముందుగా ఎలుగుబంటి ఇంటి తలుపు కొడుతూ .. ఎలుగు మామా.. ఎలుగు మామా .. నక్కనొచ్చాను.. కాస్త తేనె, చేపలు ఉంటే పెట్టవా.. ఆకలిగా ఉంది అని అడిగింది. ఎలుగు తలుపు తీయకుండానే నేనింకా బయటకు వెళ్లలేదు. మళ్లీ రా అని సమాధానం చెప్పింది. నక్క ఆవులిస్తూ ముందుకు నడిచి ఏనుగు ఇంటి తలుపు తట్టింది. ఏనుగు మామా.. ఏనుగు మామా.. నేను నక్కను వచ్చాను, కొన్ని పండ్లు ఉంటే పెట్టవా అని అడిగింది. ఏనుగు కూడా తలుపు తీయకుండా నేనింకా తోటకెళ్లలేదు. మళ్లీ రా అని చెప్పింది.

ఆ తర్వాత నక్క పులి ఇంటికి వెళ్లి తలుపు కొట్టింది. పులిరాజా.. పులిరాజా.. నక్కనొచ్చాను, మీరు తినగా మిగిలిన మాంసం ఉంటే పెట్టవా అని అడిగింది. అది కూడా తలుపు తీయకుండానే నేనింకా వేటకు వెళ్లలేదు. వెళ్లి వచ్చాక రా.. మిగిలితే చూద్దాం అని చెప్పింది. దీంతో నక్క చేసేది ఏమి లేక పక్కనే చెరువులోకి దిగి కడుపు నిండా నీరు తాగి చెట్టు కింద నీడలో కూర్చుండిపోయింది. పొద్దునే ఆహారం కోసం అడుక్కుంటున్న నక్కను చూసి ఆశ్చర్యపోయిన కోతి చెట్టు మీద నుండి నక్కను పరిశీలించగా, నక్కకు కాళ్లు చేతులు బాగానే ఉన్నాయి. ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపించింది. అడవిలో జంతువులు కష్టపడి వాటి ఆహారం అవి సంపాదించుకుని తింటుంటాయి. కానీ ఇంత సోమరిపోతును తాను ఎప్పుడూ చూడేలదు. ఈ నక్కకు జ్ఞానోదయం కల్గించాలి అని కోతి భావించింది. మరో పక్క కోతి కాలుకు ముల్లు దిగడం వల్ల నడవలేకపోతున్నది. తన ఇంటికి చేరాలంటే చెరువు దాటి వెళ్లాలి. చెరువులో అంత దూరం ఈదుకుంటూ వెళ్లడం కష్టమే. దీంతో కోతికి ఓ ఉపాయం తట్టింది.
కోతి మెల్లగా చెట్టు దిగి, నక్కతో .. ఆహారం సొంతంగా సంపాదించుకోకుండా ఎందుకు అడుక్కుంటున్నావు అని నక్కను కోతి ప్రశ్నించింది. దీంతో నక్క .. మిత్రమా నాకు వేటాడటం చేతకాదు, ఇతర జంతువులు తిని వదిలివేసిన అహారం సంపాదించే శక్తి లేదు అంటూ ఎక్కడలేని నీరసం ప్రదర్శించింది. మిత్రమా.. నేను ఈ చెరువు అవతలి ఒడ్డున ఉన్న అడవిలో ఉంటాను, అక్కడ నిన్న ఉదయం రెండు ఏనుగులు భీకరంగా పొట్టాడుకున్నాయి. ఆ పొట్లాటలో రెండు ప్రాణాలు కోల్పోయాయి. నీకు నెలరోజుల సరిపడా మాంసం దొరుకుతుంది, ఇలా శ్రమపడి అడుక్కోవాల్సిన అవసరం లేదు అని నక్కకు కోతి ఆశ చూపింది. మాంసం అనగానే నక్కకు ఆనందం వేసింది. వెంటనే అక్కడకు వెళ్తామని చెప్పింది.
దీంతో కోతి చాలా తెలివిగా, మిత్రమా .. నడుస్తూ వెళితే మనం అక్కడకు వెళ్లాలంటే చీకటి పడుతుంది. నువ్వు నన్ను నీ వీపు మీద ఎక్కించుకుని చెరువులో ఈదుతూ వెళ్తావంటే కాస్త సమయంలోనే చేరుకోవచ్చు అంటూ దూరంగా కనిపిస్తున్న అడవిని నక్కకు కోతి చూపించింది. దీంతో నక్క ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కోతిని నక్క తన వీపు మీద ఎక్కించుకుని చెరువులోకి దిగింది. ఏనుగు మాంసం మీద ఆశతో కష్టపడి ఈది అవతలి ఒడ్డుకు చేరింది. మిత్రమా .. ఏనుగు మాంసం ఎక్కడ అని అడిగింది కోతిని నక్క. అయితే కోతి నక్కను తన నివాస ముండే చెట్టు వద్దకు తీసుకువెళ్లి మామిడి పండ్లు పెట్టి అతిధి మర్యాదులు చేసింది. ఆకలి మీద ఉన్న నక్క అవురావురుమంటూ మాట్లాడకుండా పండ్లను తినేసింది.
కొద్దిసేపటి తర్వాత నక్కతో కోతి మిత్రమా.. బద్దకం మహా శత్రువు. దాన్ని దరి చేయనీయవద్దు. శ్రమతో సంపాదించుకున్న ఆహారం ఎంతో రుచిగా ఉంటుంది. నిజంగా నీకు ఆహారం సంపాదించుకునే శక్తి లేకపోతే అంత పెద్ద చెరువును ఎలా ఈదగలిగావు. ఆకలి మీద ఉన్న నీకు ఎన్ని చెప్పినా అప్పుడు అర్ధం అయ్యేది కాదు. ఇప్పుడు చెబుతున్నాను. నా కాలికి ముల్లు గుచ్చుకుని నడవలేక పోవడంతో నీకు ఏనుగు మాంసం అశ చూపి దగ్గర దారి అయిన చెరువు మీదుగా నీ సాయంతో ఇంటికి చేరుకున్నాను అంటూ అసలు విషయం చెప్పి క్షమాపణలు కోరింది. నక్కకు కోతి మీద కోపం రాలేదు. తన తప్పేమిటో అర్ధం చేసుకుంది. దానిలో ఉన్న శక్తిని గ్రహించింది. తన చేతిలో ఉన్న గుమ్మడి చిప్పను చెరువులో పడేసి తిరిగి అడవికి బయలుదేరింది. అప్పటి నుండి సోమరితనాన్ని వదిలిపెట్టి ఆహరాన్ని కష్టపడి సంపాదించుకుని తిన సాగింది.
Chandrababu Case: ఏసీబీలో చంద్రబాబుకు మరో సారి చుక్కెదురు .. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా