Avunu Valliddaru Ista Paddaru: మనోజ్ కట్లు కట్టేసి ఉండటంతో.. రేయ్ ఎవర్రా నన్ను కిడ్నాప్ చేసింది. మర్యాదగా నన్ను వదిలిపెట్టండి అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు రెడ్డప్ప అని.. ఆ పక్కనే కిడ్నాప్ అయి ఉన్న అతను చెబుతాడు.. వాళ్లు డబ్బులు కోసం కిడ్నాప్ చేసి ఉంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే నిన్ను వదిలేస్తారు అని తను అంటాడు.. నేను డాక్టర్ని నాకు ఎలాంటి అప్పులు లేవు.. నన్ను మర్యాదగా వదిలిపెట్టండి అని మనోజ్ పెద్దగా అరుస్తాడు.

అంతలో రెడ్డప్ప అక్కడికి వస్తాడు.. చూసి మనోజ్ గుర్తుపట్టి నేను మెడికల్ క్యాంపు పెట్టాను నేను డాక్టర్ని అని మనోజ్ చెబుతాడు.. అవును నాకు గుర్తుంది నా పెళ్లి రేపే సార్ వదిలిపెట్టండి అని మనోజ్ అంటారు. మీ పెళ్లి కళావతి తో కాదు.. నా మేనకోడలు కూడా ఆ అమ్మాయి కూడా అందంగా ఉంటుంది.. నీకు తగిన జోడి అని రెడ్డప్ప చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. నేను చెప్పేది వినండి అని మనోజ్ పెద్దగా అరుస్తాడు.. కానీ రెడ్డప్ప వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Avunu Valliddaru Ista Paddaru: ఢిల్లీ ముందే మనోజ్ కిడ్నాప్.. పెళ్లి ఆపకపోతే చంపేస్తాం..!
ఇన్ని రోజులు నేను కళావతి కోసం నేను మనోజ్ లాగా గెటప్ వేసుకున్నాను.. ఈరోజు నా కుటుంబం కోసం వాడి గెటప్ వేసుకుంటాను.. అని ఢిల్లీ తన ఫ్రెండ్స్ తో అంటాడు. రేపటిలోపు నా తమ్ముడు ఎక్కడ ఉన్నా సరే వాడిని వెతికి ఈ ఇంటికి తీసుకురావాలి.. కళావతి విషయం చెప్పి ఆ తరువాతే నేను కళావతి మెడలో తాళి కడతాను అని ఢిల్లీ తన ఫ్రెండ్స్ తో చెబుతాడు.
Intinti Gruhalakshmi: తులసికి చీర కొనిచ్చి లాస్య ఏమీ ఇవ్వని నందు.. రేపటికి సూపర్ ట్విస్ట్..
మనోజ్ గెటప్ లో ఢిల్లీ ఇంట్లోకి వస్తాడు. పెళ్ళికొడుకు లాగా ముస్తాబవుతాడు. ఢిల్లీ వాళ్ళమ్మ దేవకిని దీపారాధన చేసే ముడుపు కట్టమని చెబుతుంది.. ఇంట్లో పెళ్లి తంతు పనులన్నీ జరుగుతా ఉంటాయి. ఢిల్లీలో ఉన్న మనోజ్ మాత్రం కంగారుపడుతూ ఉంటాడు.

ఇక రేపటి ఎపిసోడ్ లో మనోజ్ ఒంటిని ండా దెబ్బలు తగిలి గాయాలతో కనిపిస్తాడు. తన పక్కనే పూజ కూడా కనిపిస్తుంది. నేను కళావతిని ప్రేమిస్తున్నాను.. తన మెడలో తప్ప ఇంకెవరి మెడలోనే తాళికట్టను అని మనోజ్ చెబుతున్న మాటలు విని పూజ ఇక్కడి నుంచి పారిపోవడానికి నేను నీకు సహాయం చేస్తాను అని చెబుతుంది మా మామ రెడ్డప్ప చూడకుండా.. నిన్ను ఇక్కడి నుంచి నేను తప్పిస్తాను.. నువ్వు పారిపో అని పూజ మనోజ్ కి సాయం చేస్తానని చెబుతుంది..