Avunu Valliddaru Ista Paddaru: ఎందుకు రమ్మన్నావు అని కళావతి మనోజ్ ని దగ్గరకు వచ్చి అడుగుతుంది.. ప్రేమ కోసం ఏం తప్పు చేసినా పర్వాలేదా అని మనోజ్ లాగా ఉన్న ఢిల్లీ అడుగుతాడు. దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. హద్దులు దాటితే పనిష్మెంట్ తప్పదు అని కళావతి అంటుంది. అయితే ప్రేమ కోసం నేను తప్పు చేశాను.. నన్ను క్షమించు అని ఢిల్లీ అంటాడు ..నువ్వు తప్పు చేయడం ఏంటి అని కళావతి అడుగుతుంది.

నేను మనోజ్ ని కాదు ఢిల్లీని అని చెబుతాడు. నువ్వు ఏ శిక్ష వేసిన నేను భరిస్తాను అంటూ.. నన్ను క్షమించు అని ఢిల్లీ మోకాళ్ళ మీద కూర్చుంటాడు. ఢిల్లీని అక్కడ చూడగానే కోపంతో చెంప పగలగొట్టడానికి కళావతి చెయ్యి ఎత్తుతుంది. చంప వరకు చెయ్యి తీసుకువచ్చిన కళావతి కొట్టకుండా ఆగిపోతుంది నేను ప్రాంక్ చేశానని మీరు కూడా నన్ను ప్లాన్ చేస్తున్నారా అని అడుగుతుంది.. అయ్యో అది కాదండి నేను నిజమే చెబుతున్నాను నేను నిజంగా ఢిల్లీ నే అని చెబుతాడు కానీ కళావతి ఆ మాటలను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

Intinti Gruhalakshmi: అభి మీద కోపంతో తులసి మెడకి ఉచ్చు బిగించిన గాయత్రి.. నందు కేఫ్ ఎటు వైపు.?
పూజ తన లెఫ్ట్ హ్యాండ్ ని పంపిస్తాను అనింది. ఇంతవరకు పంపించలేదు. నిజంగా ఏమైనా జరగకూడనిది జరిగిపోతుందా.. పూజ కూడా నాకు హ్యాండ్ ఇస్తుందా అని అనుకుంటాడు. అంతలో రౌడీలు వచ్చి తలుపు తీసి ఈ పెళ్లి బట్టలు ఇచ్చి డ్రెస్ వేసుకొని త్వరగా రెడీ అవ్వమని చెబుతారు. ఇక మనోజ్ త్వరగా పెళ్లి బట్టలు వేసుకొని దస్తగిరికి థాంక్యూ చెప్పి.. లెఫ్ట్ హ్యాండ్ కార్లో ఎక్కి బయలుదేరుతాడు. ఆ వెనకమాలే రెడ్డప్ప మనుషులు కూడా మనోజ్ ని ఫాలో అవుతారు.

ఢిల్లీ తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి నా తమ్ముడు మనోజ్ ఏడ ఉన్నాడు తెలిసిందా అని అడుగుతాడు .. అరగంటలో నీకు ఫోన్ చేస్తాను మనోజ్ ఇక్కడే ఉన్నాడని తెలిసింది అని తన ఫ్రెండ్స్ చెబుతారు.. కళావతి పెళ్లికూతురుగా రెడీ అయి మనోజ్ కి ఫోటో పంపిస్తుంది. ఎలా ఉంది అని అడుగుతుంది. ఒక వైపు మనోజ్ కనిపించలేదు అనే భయం మరోవైపు కళావతి తో తన పెళ్లి ఏమవుతుందో తెలియని అయామయంలో ఢిల్లీ ఉంటాడు.
Krishna Mukunda Murari: అందరి మురారికి ప్రపోజ్ ముకుంద చేస్తానని ఛాలెంజ్.. కంగారులో రేవతి..

ఇక రేపటి ఎపిసోడ్లో కల్యాణ మండపం దగ్గరికి మనోజ్ వస్తాడు. తీరా అక్కడికి వచ్చి చూసేసరికి మనోజ్ ప్లేస్ లో ఢిల్లీ పెళ్ళికొడుకాయ్యి కనిపిస్తాడు. కళావతి ఢిల్లీ ఎదురెదురుగా కళ్యాణమండపంలో కూర్చోవడం చూసి మనోజ్ షాక్ అవుతాడు. ఇక ఏం జరుగుతుందో చూడాలి.
