Avunu Valliddaru Ista Paddaru: ఢిల్లీ బార్ షాప్ లో ఒకడిని కొట్టడం.. ఆ విషయం పోలీసులకు తెలిసి ఢిల్లీ నీ తీసుకు వెళ్లడానికి ఇంటికి ఇంటికి వస్తారు, కానీ అక్కడ ఢిల్లీ లాగా ఉన్న మనోజ్ ను తీసుకువెళ్తారు. అతను మనోజ్ అని ఢిల్లీ కాదని మీరు ఇంతకుముందు కూడా పొరపడ్డారు అని చెప్పినా కూడా.. ఆ పోలీసులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా మనోజ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి పోతారు.

మనోజ్ ను పెంచిన తల్లి ఇంట్లో వాళ్ళందరూ ముందు ఆగ్రావేశురాలవుతుంది. ఇలాంటి ఇంట్లోనా నా కొడుకు పెళ్లి జరగాలని అనుకున్నాను.. చి చి ఇలాంటి వాళ్ళని చూస్తుంటేనే నాకు చిరాకు వేస్తుంది. నా బిడ్డ ఎప్పుడూ పోలీస్ స్టేషన్ కి వెళ్లలేదని తను బెంగళూరులో డాక్టర్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడని.. వాడిని చూస్తేనే అందరూ చేతులెత్తి దండం పెడతారని అలాంటిది ఈరోజు పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లడానికి కారణం ఢిల్లీ అని అలాంటి ఇంట్లో అస్సలు నేను క్షణం కూడా ఉండనని.. మనోజ్ వాళ్ళమ్మ కోపంతో ఊగిపోతూ కళ్ళు తిరిగి పడిపోతుంది.

Avunu Valliddaru Istapaddaru: పూజ కి అలా దగ్గరవుతున్న మనోజ్.. కళావతి చూసేసిందా.!?
రాత్రికి ఢిల్లీ ఇంటికి చేరుకుంటాడు. ఢిల్లీ వెళ్లేసరికి ఇంట్లో వాళ్ళందరూ గుమ్మంలో ఎదురుచూస్తూ ఉంటారు. ఢిల్లీ ఇంట్లోకి కాళ్లు పెట్టడం తనే వాళ్ళ నాన్న నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు ఇంట్లో నుంచి బయటికి పొమ్మని తన బ్యాగ్ తీసి బయట విసిరేస్తాడు. రెండు రోజుల్లో వాళ్ళ అన్నయ్య పెళ్లి పెట్టుకొని ఇప్పుడు బయటకు పొమ్మంటే ఎలా పోతాడు అంటూ ఢిల్లీని ఆపడానికి ప్రయత్నిస్తారు..
ఢిల్లీ మందు తాగి ఎవర్నో కొట్టడం వల్లే ఇదంతా జరిగిందని ఇంట్లో నుంచి పంపించేస్తున్నరా లేదంటే కళావతి తో మాట్లాడుతున్నాడని తెలిసిపోయి ఢిల్లీ నీ ఇంట్లో నుంచి పంపించిన చేస్తున్నారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స గా ఉంచారు. రెండు రోజుల్లో మనోజ్ కళావతి పెళ్లి జరగనుంది. కానీ ఢిల్లీ ఎలాంటి ప్లాన్ స్కెచ్ వేసి కళావతిని తను పెళ్లి చేసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.