BrahmaMudi: బ్రహ్మముడి సీరియల్ లో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న మానస్. ఈ సీరియల్లో రాజ్ పాత్రలో అద్భుతమైన నటనని కనుపరుస్తూ ప్రేక్షక ఆదరణ పొందుతున్నాడు. చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో స్టార్ అవుతామని అనుకుంటారు కానీ అది కొందరికే కలిసొస్తుంది. వెండి ధర మీద కొన్ని సినిమాలు చేస్తూ అక్కడ లెక్క కలిసి రాకపోవడంతో ఇండస్ట్రీని వదిలిపెట్టి బుల్లితెర వైపు చూస్తుంటారు కొంతమంది. సైడ్ క్యారెక్టర్స్ తో సరిపెట్టుకొని ఆపై టీవీ రంగంలో రాణిస్తుంటారు కొంతమంది. అలా వచ్చినవాడే మానస్. ఇతను కొన్ని సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు. గ్రీన్ సిగ్నల్ కాయ్ రాజా కాయ్ ప్రేమికుడు సోడా గోలి సోడా గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో నటించాడు.

కాయ్ రాజా కాయ్ సినిమాలో కొంచెం గుర్తింపు వచ్చిందని చెప్పాలి.సినిమాల్లో అంత అవకాశాలు రాకపోయేసరికి బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కోయిలమ్మ పితృదేవోభవ దీపారాధన వంటి సీరియల్స్ లో నటించాడు. కోయిలమ్మలో ఇతని నటనకి మంచి ప్రేక్షకాదరని వచ్చింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత బిగ్ బాస్ 5 లో అడుగు పెట్టాడు. ఈ సిరీస్లో ఫైనల్ లిస్ట్ కా కూడా నిలిచాడు మానస్. నిజానికి ఇతను విన్నర్ మెటీరియల్ అయినప్పటికీ సన్నీకి క్లోజ్ ఫ్రెండ్ కావడంతో మానస్ కి విన్నర్ అవ్వలేకపోయాడు అని ఒక టాక్ కూడా ఉంది. అనవసరమైన విషయాలు వేలు పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ ప్రతి విషయాన్ని కూల్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ మెచ్యూర్డ్ పర్సన్ లా బిహేవ్ చేస్తూ అందరి మనసుల్ని కొల్లగొట్టాడు మానస్.

బిగ్బాస్ ఫేమ్ కంటిన్యూ అవుతూనే ఇతను మరో కొత్త సీరియల్ బ్రహ్మముడి సీరియల్ తో మళ్లీ అందరి ముందుకి వచ్చాడు మానస్. కార్తీకదీపం సీరియల్ ముగిసిన తర్వాత ఆ టైమింగ్ లో బ్రహ్మముడి సీరియల్ తో ఎంట్రీ ఇచ్చాడు రాజ్ పాత్రలో మన మానస్. తన మెచ్చుడునటన తో మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించాడు ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ టీఆర్పి రేటింగ్స్ లో దుమ్ము దులుపుతున్న నే చెప్పొచ్చు. ఇప్పుడు స్టార్ మా లో వినాయక చవితి సందర్భంగా స్పెషల్ ప్రోగ్రాం గణపతి పప్పా మోరియా, లో మానస్ ఒక మంచి గెటప్ తో అందరినీ అలరిస్తున్నాడు.

గణపతి పప్పా మోరియా ప్రోమోస్ చూసిన వారందరికీ మానస్ అద్భుతంగా డాన్స్ వేశాడు అని అనిపిస్తుంది. గణపతి పప్పా మోరియా అనే ప్రోగ్రామ్ కి రవి యాంకర్ గా చేస్తున్నాడు. ఈ ప్రోగ్రాంలో పల్లెటూరు పట్నం అనే ఇద్దరు కేటగిరీ లో పోటీ ఉంటుంది. పల్లెటూరి టీం వైపు దేవతా ఫ్రేమ్ అర్జున్, పట్నం టీం వైపు కార్తీకదీపం ఫ్రేమ్ నిరూపమ్, లీడర్స్ గా ఉండిఈ ప్రోగ్రామ్ లో సందడి చేయనున్నారు.ప్రోగ్రాం మధ్యలో అనసూయ గెస్ట్ రోల్ లో అలరించనుంది.

ఈ ప్రోగ్రాంలో హీరో కిరణ్ అబ్బవరం నేహా శెట్టి ఇద్దరూ సమ్మోహనుడా అనే సాంగ్ కి డాన్స్ వేసి అలరించనున్నారు. బ్రహ్మముడిలో ఉన్న, కావ్య, కనకం, జబర్దస్త్ యాక్ట్ చేస్తున్న వాళ్లు, అవినాష్,వర్షిని, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిన సీరియల్ లోని నటీనటులు ఇలా చాలామందితో ప్రోగ్రాం ని కండక్ట్ చేస్తున్నారు.మానస్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా,అభిమానులతో పుష్ప టు గెటప్ లో ఉన్న ఫోటోని పోస్ట్ చేశాడు.ఈ ప్రోగ్రాం వినాయక చవితి రోజు స్టార్ మా లో ప్రసారం కానుంది. అలాగే హాట్ స్టార్ లో స్విమ్మింగ్ కానుంది.ఈ ప్రోగ్రాంలో మానస పుష్ప 2 గెటప్ లో ఏ బిడ్డ ఇది నా అడ్డ అనే సాంగ్ కి డాన్స్ వేసి అలరించాడు ఆ ప్రోమో ఇప్పుడు మీకోసం చూసి అలరించండి.