Brahmamudi అక్టోబర్ 24 ఎపిసోడ్ 235: నువ్వు చేసిన పని తప్పు కాదు రాజ్, అవును రాజ్ మీ అమ్మకి చెప్పి చేయడం పోవడమే తప్పుఅని రుద్రాణి అంటుంది. నువ్వు చెయ్యాలి అనుకున్నప్పుడు మీ అమ్మకు ఒక మాట చెప్పాల్సింది అని రుద్రాణి అంటే.. అమ్మమ్మ గారు వెంటనే, ఏంటి తప్పు ఎవరు తప్పు నీదా నీ కోడలుదా, కావ్య కూడా నీ కోడలే కదా, పడకగది దాటకుండా మంచాల మీదే అన్నీ తెప్పించుకొని తినే రకం అయితే అందరం ఆకలితో మాడి చచ్చేవాళ్ళు అన్ని పనులు తన్ను ఎత్తిన మీద వేసుకొని తన గదికి వెళ్లడానికి రాత్రి 11 దాటుతుంది. తెల్లవారి ఐడెంటికే లేస్తుంది. అందరికీ అన్ని చేస్తుంది. అలా అన్ని పనులు వేసుకొని చేస్తుంటే తన భార్య కష్టపడడం చూడలేక పాత పనిమనిషిని రప్పించాడు. మీరు అది అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడితే ఎలాగూ. అయినా ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకు అని అంటుంది ఇందిరా దేవి.

రాజ్ నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం తప్పుకాదు కానీ, ఈ నిర్ణయం తీసుకునేటప్పుడే నాకు ముందుగా ఒక్క మాట చెప్పి ఉంటే బాగుండేది అని వాళ్ళ అమ్మ అంటుంది. ఏంటి రుద్రాణి? ఈ ఇంట్లో పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నావు.. పాపం అదేది జరగలేదు అనుకుంటా.. పాపం బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావ్ అని రుద్రాణిని అపర్ణ అంటుంది. నా కొడుకుని నా తోటి కోడల్ని ఏవో మాటలు అన్నావు. ఈ ఇంట్లో గొడవ జరిగితే చూసి సంతోషించే దానివి నువ్వే అని నాకు తెలుసు రుద్రాణి అని అపర్ణ అంటుంది.
ఎవే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీ పని నువ్వు కూడా చేసుకోలేవా.. టాబ్లెట్స్ వేసుకోమంటే వేసుకో వేంటి అని కనకం స్వప్న పై అరుస్తుంది. ఇక స్వప్న ఆ టాబ్లెట్ వేసుకొని కనకం వెళ్ళిపోయిన తర్వాత ఆ టాబ్లెట్ తీసి డస్ట్ బిన్ లో పడేస్తుంది. ఇకనుంచి ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని స్వప్న మనసులో అనుకుంటుంది.
రాజ్ ఫోన్ మాట్లాడుతుండగా కావ్య గదిలోకి వస్తుంది. మీరు చేసిన పనిని నాకు నచ్చలేదు అని కావ్య రాజ్ తో అంటుంది. అదేంటి నేను థాంక్స్ చెప్తావేమో అని అనుకున్నాను అని రాజ్ అంటాడు. మీరు అత్తయ్యకు ఇష్టం లేని పని చేశారు అత్తయ్య మీ మీద కోపంగా ఉంది అదేంటి ఇందాక నాతో బాగానే మాట్లాడింది కదా నీతో కూడా బాగానే మాట్లాడింది కదా ఆ విషయం మీరు తనని అడిగి తెలుసుకోవాలి అని అంటుంది వెంటనే శాంతాని పనిలో నుంచి తీసేయండి. తనకు కొంత డబ్బులు ఇచ్చి పంపించేసేయండి అని కావ్య అంటుంది. ఇక ఆ మాటలకి రాజ్ ఇదంతా నేను చూసుకుంటాను. శాంతాని పనిలో నుంచి తియ్యను. ఇప్పుడే వెళ్లి మా అమ్మతో మాట్లాడుతాను. మా అమ్మని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు అని రాజ్ అంటాడు.

రాజ్ వాళ్ళ అమ్మ దగ్గరకి వెళ్తాడు. నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు అని అంటుంది అపర్ణ. అది కాదు మమ్మీ అని రాజ్ చెప్పబోతుంటే.. మీ అమ్మ మాట శిలా శాసనం అని నువ్వే అంటావు. ఇప్పుడు నువ్వు ఎలా మర్చవు అని అంటుంది. నేను మరిపోయనా.. నువ్వు మరిపోయావా అని అంటుంది. నువ్వు కావ్య విషయంలో మరిపోయవా.. ఒకప్పుడు నేను నా మౌనాన్ని కూడా రాజ్ అర్థం చేసుకుంటాడని గొప్పగా చెప్పుకునే దానిని కానీ ఇప్పుడు చెబుతున్న అర్థం చేసుకోలేని స్థాయికి వెళ్ళిపోయావు. ఇక రాజ్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇక తన గదిలోకి వచ్చి రాజ్ వాళ్ళమ్మ అన్నమాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే రాజ్ కి తన ఆత్మ మాస్ గెటప్ లో తన ఎదురుగా కనిపిస్తుంది. నువ్వు కావ్య ను ప్రేమిస్తున్నావు అని ఎవరు చెప్పినా నమ్మడం లేదు కానీ అదే నిజం అని అంటాడు.
కనకం తన చీరలను రుద్రాణి చించేసిందని.. ముల్లును ముల్లుతోనే తీసేయాలి అలానే నా చీరలను కత్తెరతోనే చంపేసింది కాబట్టి నేను కూడా రుద్రాణి చీరలను కత్తెరతోనే చించేస్తాను అని ఒక కత్తెర తీసుకొచ్చి రుద్రాణి చీరలు అన్నింటిని కత్తెరతో పరపరా చించేస్తుంది. ఇక కనకం ఏమీ తెలియనట్టు బెడ్ మీద నిద్రపోతుంది. కాసేపటి తరువాత రుద్రాణి గదిలోకి రాగానే స్నానానికి వెళ్లడానికి తన చీర తీసుకుంటుంది. ఆ చీర మడతేస్తూ ఉంటే చీర కత్తిరించినట్లు కనిపిస్తుంది. ఇక అక్కడ ఉన్న ఇంకో రెండు చీరలు చూడగా అవి కూడా కత్తిరించినట్టు కనిపిస్తాయి. ఇక కోపంతో రుద్రాణి అరవటంతో కనకం నిద్రలేస్తుంది. ఇదంతా ఆ ఎలుక చేసిన పనే వదిన అని కనకమంటుంది. నువ్వేమీ బాధపడకు వదినా ఆయనకు సంగతి నేను చూస్తాను. అప్పటివరకు మీరు స్వప్న గదిలో ఉండండి అని కనకం రుద్రాణి ఎత్తుకు పై ఎత్తు వేసినట్లుగా సమాధానం చెబుతుంది.
రేపటి ఎపిసోడ్ లో కావ్య నిద్రపోవడానికి కింద పరుపు వేస్తుంది. ఇందిరా దేవి పాలు గ్లాసు తీసుకొచ్చి అమ్మ కావ్య అంటూ తలుపు కొడుతుంది. ఆ హడావిడిలో పరుపుని గోడ బయట పడేస్తాడు రాజ్. ఇక తలుపు తీసిన కావ్యకి పాల గ్లాస్ ఇస్తుంది ఇందిరాదేవి. ఇక ఇప్పుడు నేను ఎక్కడ పడుకోవాలి అని కావ్య అంటుంటే.. రాజ్ కావ్య ను బెడ్ మీద పడుకోపడతాడు.