Brahmamudi ఎపిసోడ్: రాజ్ ఆడుతున్న నాటకం గురించి తెలిసి మనసు విరిగి ఒక గుడిలో కూర్చున్న కావ్య ని చూసి పూజారి సీతారామయ్య కి ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు సీతారామయ్య మరియు ఇందిరా దేవి అక్కడికి వెళ్లి, కావ్య కి బ్రెయిన్ వాష్ చేసి ఇంటికి తీసుకొని వెళ్ళడానికి సిద్ధం అవుతారు. అప్పుడే రాజ్ అక్కడకి ఎంట్రీ ఇచ్చి ఏంటి ఇంటికి రాను అంటుండా?, మీరు ఎందుకు ఆమెని అంతలా బ్రతిమిలాడుతున్నారు?, అసలు ఇక్కడ కూర్చొని ఏమి చేస్తున్నావ్, నిన్ను..! అని కోపం తో కావ్య చెంప పగలగొట్టడానికి రాజ్ చెయ్యి ఎత్తుతాడు.

కావ్య చెంప పగలకొట్టబోయిన రాజ్ :
అప్పుడు ఇందిరా దేవి ఆగిపోయావే, నువ్వు దాని భర్తవి, మా పేరు చెప్పి రెండు వెయ్యి అని అంటుంది. లేకపోతే ఏంటి నానమ్మ, అసలు ఈమెని ఎవరు ఏమి అన్నారని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చేసింది?, అవతల వీళ్ళ అమ్మా నాన్న ఏమో మమల్ని దోషిగా చేసి నిలబెట్టి ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అనింది. కూతురు కనిపించకుండా పోయిన బాధలో ఉన్నారని నేను కూడా ఏమి అనలేదు, కానీ ఇలా బాధ్యత లేకుండా చెప్పాపెట్టకుండా ఇలా రావడం ఏమిటి?, రాత్రంతా నిద్ర లేకుండా రోడ్లు పట్టుకొని పిచ్చోడిలా తిరుగుతూ ఉన్నాను అని అంటాడు.

రాజ్ కి కావ్య మొక్కు తీర్చుకోడానికి వచ్చింది అంటూ అబద్దం చెప్పిన ఇందిరా దేవి:
అసలు ఇక్కడేమి చేస్తుంది నానమ్మ అని రాజ్ అడగగా, తన కాపురం కుదుట పడితే, ఒక రాత్రి మొత్తం ఇక్కడ నిద్ర చేస్తానని మొక్కుకుంది. తెల్లవారుజామున పూజారి చూసి ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చాము అని అంటుంది. ఆ తర్వాత మీ కాపురం చక్క పడింది నిజమే కదా , తన మీద ప్రేమ నిజంగానే చూపించావ్ కదా? అని అడుగుతుంది ఇందిరా దేవి. నిజమే అందులో సందేహం ఏముంది అని అంటాడు రాజ్. మరి అయితే నీ పెళ్ళని ఇక్కడి నుండి తీసుకెళ్ళు అని అంటుంది ఇందిరా దేవి. అలా కోపం గా పిలిస్తే నేను రాను అని కావ్య అనగా,ఇంకెలా పిలవాలి నిన్ను అని చేతులు పట్టుకొని ఈడ్చుకెళ్తాడు రాజ్. ఇది చూసి ఇందిరా దేవి, ఇది కూడా నాటకమేనా భావా అని సీతారామయ్య ని అడుగుతుంది. అప్పుడు సీతారామయ్య లేదు బుజ్జి, రాజ్ మనసులో ప్రేమ ఉంది, కానీ దానిని ఎదో మాయ కప్పేస్తుంది, అది తొలిగిపోయేలా మనమే చెయ్యాలి అని అంటాడు.

కనకం మరియు మూర్తి ని కోపం తో తిట్టేసిన కావ్య:
మరోపక్క కావ్య కనిపించకుండా పొయ్యినందుకు కనకం మూర్తి తో ఇక పోదాం పదండి అయ్యా, ఏ బావిలోనో, రైలు పట్టాల మీదనే పడిపోయి ఉంటుంది, వెళ్లి వెతుకుదాం అని అంటుంది. అప్పుడు అపర్ణ కోపం తో పైకి లేచి, అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం, కావ్య ఆత్మహత్య చేసుకుంది అంటున్నారా?, లేదా మేమె చంపేసాము అనుకుంటున్నారా అంటి అంటుంది. అప్పుడు కనకం, అమ్మా మేము మీ స్థాయి లో లేని వాళ్ళం, కూతురు కనిపించకుండా పోయింది, మా మైండ్ ఇలా దిగజారే ఆలోచిస్తుంది, ఏమి చేయమంటావ్ అని అంటుంది. ఇంతలోపే కావ్య వస్తుంది. ఆమెని చూడగానే కనకం వెంటనే హత్తుకొని, నిన్ను మళ్ళీ ప్రాణాలతో చూస్తామని అనుకోలేదు అమ్మా అని అంటూ ఏడుస్తుంది. అప్పుడు కావ్య అసలు ఇక్కడ ఏమి జరుగుతుంది

అమ్మా, మీరు నా కుటుంబాన్ని నిలదీసారా?, నేను ఇక్కడ ఎలా ఉంటున్నానో మీరు మీ కళ్ళతో చూడలేదా?, ఇంత గొప్ప కుటుంబాన్నే అవమానిస్తారా?, అసలు ఏమనుకుంటున్నారు మీరు, అయినా నా కుటుంబాన్ని నిలదియ్యడానికి నీకు ఎవరు హక్కు ఇచ్చారు అని అంటుంది కావ్య. అప్పుడు అపర్ణ వాళ్ళు అలా మాట్లాడడానికి కారణం నువ్వే కదా ?, అసలు ఎక్కడికి వెళ్ళావ్, ఎందుకు వెళ్ళావ్?, ఎవరు నిన్ను ఏమన్నారు అని నిలదీస్తుంది. ఇందిరా దేవి మొక్కు గురించి కావ్య కి వివరిస్తుంది, అప్పుడు అపర్ణ ఇవన్నీ మీరు నమ్ముతున్నారా?,వీళ్ళ అమ్మా నాన్న ఇన్నేసి మాటలు అన్నారో మర్చిపోయారా? అని అంటుంది. ఒకప్పుడు రాజ్ కనకం వాళ్ళ ఇంట్లో కాళ్ళు జారీ పడిపోతే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లి నా కొడుకుని ఏమి చేసారు అంటూ నిలదీసి గొడవలు వెయ్యలేదా?, అది తల్లి మనసు, ఈరోజు కనకం కూడా ఒక తల్లిగానే మాట్లాడింది అంటూ సమాధానం ఇస్తుంది ఇందిరా దేవి.