BrahmaMudi November 11 Episode 251: ఇక రాజ్ సీతారామయ్య కోసం డాక్టర్ని మాట్లాడుతూ ఉంటాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు మీరు ఆ డాక్టర్ని పిలిపించండి అని ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది. మీరు నాకు అనుకున్న తర్వాత ఫోన్ చేయండి అని పక్కకు తిరుగుతాడు రాజ్ కావ్యం చూసి ఏంటి సీక్రెట్ గా వింటున్నావా అని అంటాడు లేదు అని వెటకారంగా సమాధానం చెబుతుంది కావ్య. మీకోసమే అన్నం తీసుకొచ్చాను తినండి అని అంటుంది కావ్య. నీ చేతితో ఇచ్చింది నేను తినను అని అంటాడు రాజ్. నా మీద కోపం ఉంటే అన్నం తినడం మానేయాలి అని అంటుంది కావ్య. అవన్నీ నీకు అనవసరం అని అంటాడు రాజ్. తినాలో లేదో కూడా నువ్వే చెప్తావా అని అంటాడు. కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

కావ్య ధాన్యలక్ష్మితో కలిసి రాజ్ అన్నం తినే లాగా అపర్ణ అతను రెచ్చగొట్టాలని అడుగుతుంది. అందుకు ధాన్యలక్ష్మి ఒప్పుకుంటుంది. ఇక అప్పుడే అపర్ణ అటు వైపు నుంచి వస్తూ ఉండగా వాళ్ళ యాక్షన్ మొదలుపెడతారు. ఏంటి అత్తయ్య మీరు అనేది కూడా చేయలేదు రాజ్ ఎంత కోపంగా ఉన్నా మా అక్క ఈ పని చేయగలదు అని ధాన్యలక్ష్మి అంటుంది ఆయన చాలా కోపంగా ఉన్నారు అన్నం తిననన్నారు అత్తయ్య ఎలా తినిపిస్తారు అని అంటుంది అప్పుడు అపర్ణ అక్కడికి వచ్చి ఏమైంది అని అడగగా రాజ్ కోపంగా ఉన్నాడంట అక్క అన్నం తినలేదు మన కావ్య నువ్వు వెళ్లి తినిపించినా రాజ్ తినడు అని సవాల్ చేస్తుంది అని అనగానే నా బిడ్డ ఆకలితో ఉన్నాడని తినిపించడానికి వెళ్తున్నాను అంతేకానీ ఒకరి సవాల్ స్వీకరించడానికి కాదు అని అపర్ణ అంటుంది ఇక భోజనం తీసుకుని రాజు గదిలోకి వెళ్తుంది అపర్ణ ఏంటి ఎంత కోపంగా ఉంటే మాత్రం అన్నం తినకుండా ఉంటారా తినమని బలవంతం చేస్తుంది.

అప్పుడు రాజ్ ఈ వంట కూడా కావ్య చేసింది అందుకే నేను తినను అని అంటాడు. నీకోసమే నేను వండి చేసి తీసుకు వచ్చాను అని అపర్ణ అంటుంది. అప్పుడు రాజ్ తింటానికి ఒప్పుకుంటాడు నేనే తినిపిస్తాను అని అపర్ణ అంటుంది. ఇక రాజ్ కి అన్నం తినిపించి అపర్ణ ఆ ప్లేట్ తీసుకొని బయటకు వస్తుంది. మీరు చేసిన సవాల్ కోసం నా బిడ్డ పస్తులు ఉండకూడదని తినిపించాను అని అపర్ణ అంటుంది. మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు అని కావ్య అంటుంది. మనుషుల్ని ప్రేమతో సొంతం చేసుకోవాలి అని అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మొత్తానికి నువ్వు అనుకునేది సాధించావు కావ్య అని ధాన్యలక్ష్మి పొగుడుతుంది. నీ భర్త పస్తులు ఉండకూడదు అని నువ్వు ఇలా చేయడం నాకు చాలా నచ్చింది అని ధాన్యలక్ష్మి అంటుంది.

ఇక కావ్య గదిలోకి వెళ్ళగానే భోజనం చేసినందుకు సంతోషిస్తుంది. భోజనం తిన్నారు కదా అని రాజుని అంటుంది. మా అమ్మ తినిపించింది కాబట్టి తిన్నాను అని రాజ్ అంటాడు. నేను తినకపోతే అమ్మ బాధపడుతుంది అందుకే తిన్నాను అని రాజ్ అంటాడు. అప్పుడు ఆ వంట చేసింది నువ్వే అని నాకు తెలుసు అని రాజ్ అంటాడు. అవునా నేను చేశాను అని తెలిసినా కూడా మీరు ఎందుకు తిన్నారు అని కావ్య అడుగుతుంది. అమ్మ బాధపడకూడదు అనుకున్నాను అని చెబుతాడు. మీరు నా చేతి వంటని కూడా గుర్తు పట్టారా అని సంతోషంగా అడుగుతుంది. బ్యాడ్ నైట్ అని రాజ్ అంటాడు.

అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. లాయర్ అప్పుడే అక్కడికి వస్తాడు సీతారామయ్య నేను చెప్పినట్టు రాసుకు వచ్చారు కదా అని అంటాడు. అంతా మీరు చెప్పినట్టే రాసానండి అని అంటాడు లాయర్. ఇక సీతారామయ్య మంచికో చెడుకో నాకు ఆరోగ్యం క్షీణించింది ఎవరి అంతర్ముఖాలు చూడకముందే నేను ఆస్తి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అని ఆయన చెబుతాడు. అప్పుడు చిట్టి మీరు వీలునామా రాయించారు కదా దానిని నేను భద్రంగా లాకర్లో దాచిపెడతాను అని చెబుతుంది. అవును అని ఇంట్లో వాళ్ళందరూ అంటారు. నా మనసులో ఏముందో అది మీ అందరికీ తెలియాలిసిన అవసరం వచ్చింది అని సీతారామయ్య అంటాడు. దయచేసి మీలో ఎవ్వరూ అడ్డుపడకండి, లాయర్ గారు మీరు చదవండి అని అంటాడు. రుద్రాణి రాహుల్ చాలా సంతోషిస్తూ ఉంటారు. లాయర్ గారు మీరు రాసిన వీలునామా ఇంట్లో అందరికీ వినిపించండి అని అంటాడు సీతారామయ్య. లాయర్ వీలునామా తీసుకొని చదవబోతూ ఉండగా రాజ్ వచ్చి లాయర్ చేతిలో ఉన్న వీలునామా తీసుకొని చింపి పడేస్తాడు. రాజ్ అని పెద్దాయన అనగానే.. తాతయ్య మీ మీద దిక్కారంతో ఇది చేయడం లేదని నన్ను క్షమించండి అని రాజ్ అంటాడు. ముక్కలవుతున్న వీలునామా చూసి రుద్రాణి రాహుల్ షాక్ అవుతారు. ఇంట్లో ఇలాంటివి జరగడం నాకు ఇష్టం లేదు. దీన్ని ఇక్కడితో ఆపేయండి అని అంటాడు రాజ్. ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

రాజ్ ఏంటి నువ్వు చేసిన పని అని వాళ్ళ తాతయ్య అడుగుతాడు ఒక ఆరోగ్య సమస్య వస్తే.. ఆ ఆరోగ్య సమస్యలు నుంచి ఎలా కాపాడాలో అని ఆలోచించాలి. కానీ అతని ద్వారా ఎంత ఆస్తి వస్తుంది అని ఆలోచించకూడదు. నువ్వు ఎక్కువ నేను తక్కువ అని భేదాభిప్రాయాన్ని కలుగ చేయకూడదు అని రాజ్ అనగానే.. శభాష్ మనవడా నువ్వు అసలైన దుగ్గిరాల వంశానికి వారసుడువి అని చిట్టి క్లాప్స్ కొట్టు మరీ చెబుతుంది. ఆ మాటకి ఇంట్లో అందరూ సంతోషిస్తారు. మా అందరి మనసులో ఏముందో అదే రాజు చెప్పాడు అని అపర్ణ అంటుంది. రుద్రాణి ఏంటి అవాక్కయింది అని ధాన్యలక్ష్మీ అంటుంది మనందరం కలిసే ఉండాలి. అదే రాజ్ అభిప్రాయం అని నాకు అర్థమైంది అని రుద్రాణి అంటుంది. నేను అదే కోరుకుంటాను అని అంటుంది.

ఇక రేపటి ఎపిసోడ్లో కావ్య రాజుతో మన సమస్యకు మనమే పరిష్కారం వెతుక్కోవాలి. అప్పుడే తాతయ్య సంతోషంగా ఉంటారు అని కావ్య అంటుంది. ఈ సందర్భాన్ని నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావా అని రాజ్ అంటాడు. నీతో కలిసి కాపురం చేయాలని కలలో కూడా అనుకోవడం లేదు. నిన్ను నా భార్యగా ఎప్పటికీ ఒప్పుకో దలుచుకోలేదు. నాది నాటకం అయితే మీది నాటకం కూడా అని కావ్య అంటుంది. ఇక అవసరమైతే ముందు ముందు ఇంకా నటిస్తాను అని రాజ్ అంటాడు. నేను నటించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో మీరు ముందు ముందు చూస్తారు అని కావ్య రాజ్ కి సవాల్ విసురుతూ ముందుకి వెళ్లి ఏవండీ ఉమ్మ్ అని ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది కావ్య.