నీ పర్సనల్ విషయాలన్నీ మీ ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత చూసుకో అంతేగాని.. మీ సాయం కోసం ఎదురుచూసేవారు చాలామంది ఉన్నారు.. నువ్వు కనిపించగా నీతో వాళ్ళ సమస్యలు చెప్పుకోకుండా ఎవరైనా చనిపోతే.. ఇప్పటివరకు నువ్వు సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది.. ఆఫీస్ కి వెళ్ళు అని సత్య చెబుతుంది.. ఆదిత్య మౌనంగా వెళ్ళిపోతాడు..
భాగ్యమ్మ జానకమ్మ దగ్గరకు వస్తుంది. నేను ఆఫీసర్ సార్ వాళ్ళ ఇంట్లో ఉంటాను నా బిడ్డ అల్లుడు అక్కడే ఉంటారు.. నేను కూలినాలి పనిచేసుకుని బ్రతుకుతూ ఉంటాను.. మొన్న ఒకసారి మీ పొలంలో కూలి పని చేసుకోవడానికి వచ్చా కళ్ళు తిరిగి సోయలేక పడిపోతే రాధమ్మ ఈ ఇంట్లో పనికి రమ్మని చెప్పింది.. అందుకే వచ్చాను అని అంటుంది రాధ ఏ పని చేసినా ఆలోచించే చేస్తుంది. సరే నువ్వు వంటగదిలోకి వెళ్లి పని చేసుకోమని జానకమ్మ భాగ్యమ్మతో అంటుంది..
రాధ వంటగదిలో కూరగాయలు కట్ చేస్తుండగా బిడ్డ అని భాగ్యమ్మ వెళ్లి పలకరిస్తుంది.. రాధ వాళ్ళ అమ్మను హత్తుకుంటుంది.. వాళ్ళు మా రాధ రాధ అని వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు.. వీళ్ళకి ఆ గలిజ్ వాడు ఎలా పుట్టాడు అని అంటుంది భాగ్యమ్మ.. మాధవ్ సార్ గురించి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు.. ఆ మాధవ్ ఇకమీదట నుంచి నిన్ను ఏమైనా చేస్తే వాడి బొక్కలో నుంచి గుజ్జు తీస్తాను అని రాధకు ధైర్యం చెబుతుంది భాగ్యమ్మ..