రాధ నేను నీకు ఇచ్చిన ఆఫర్ నచ్చిందా అని మాధవ అడుగుతాడు.. ఏంది నువ్వు నాకు ఇచ్చే ఆఫర్.. దేవి సంతోషంగా ఉండాలని.. మీ భర్త ఇంటికి దేవిని పంపించడానికి నీకు ఒక ఆఫర్ ఇచ్చాను కదా అని అంటాడు.. నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు నా భర్త ఆఫీసర్ సారు.. ఇంకొకరు నా బ్రతుకులోకి వస్తాను అని అంటే.. ఆ క్షణమే నేను చచ్చిపోతాను ఈ విషయం గుర్తు పెట్టుకోండి అని మాధవ్ తో అంటుంది రాధ.. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు పడితే.. ఏదో ఒక రోజు నిన్ను కారుతో తొక్కించేస్తాను జాగ్రత్త అని మాధవ్ కి వార్నింగ్ ఇస్తుంది రాధ..
సత్య దిండు దుప్పటి తీసుకొని తన రూమ్ లో నుంచి బయటకు వెళ్తుంది అప్పుడే ఆదిత్య వచ్చి ఎక్కడికి సత్య అని అడుగుతాడు.. బయటికి వెళ్లి పడుకుంటాను అని సత్య అంటుంది.. అదేంటి సత్య అని ఆదిత్య అంటాడు.. ఒకే మంచం మీద ఉన్న కానీ మన మనసులు దూరంగా ఉన్నప్పుడు ఎక్కడ ఉంటే ఏమైంది అని అంటుంది.. సత్య అసలు నీ మనసులో నా స్థానం ఏంటి ఆదిత్య అని ఆదిత్యను నిలదీస్తుంది సత్య.. భార్య అని అంటాడు.. నిజంగా నేను నీ భార్యను అని నువ్వు అనుకుంటే.. నీ సంతోషాన్ని బాధలను నువ్వు నాతో ఎందుకు పంచుకోవడం లేదు అని అడుగుతుంది..
దేవుడమ్మ రాధకు పుట్టిన తన మనవడా మనవరాలు కోసమో ఒక గదినిండా బట్టలు బొమ్మలు తీసుకొచ్చి పెడుతుంది.. అప్పుడే దేవుడమ్మ వాళ్ళ ఆయన వచ్చి ఏంటి దేవుడమ్మా ఇదంతా అని అడుగుతాడు.. రాధతో మన వారసత్వం ఉందని తెలిసాక.. రేపు వాళ్ళు మన ఇంటికి ఆ బిడ్డ వచ్చాక ఆడుకోవడానికి ఇవన్నీ తీసుకువచ్చాను.. బహుశా బిడ్డ దేవి అంత వయసు ఉంటుంది కదా.. అందుకే అవన్నీ తెచ్చాను అని దేవుడమ్మ అంటుంది.. వెంటనే శంకర ప్రసాద్ ఎక్కడో ఉందో లేదో తెలియదు నీ గురించి కాదు.. ఇంట్లో ఉన్న సత్య గురించి పట్టించుకోమని చెబుతాడు.. సత్య మనకోసం పిల్లల్ని ఎంతగానో ఆరాటపడుతుంది అని దేవుడమ్మకి గుర్తు చేస్తాడు..
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!