దేవి ఆదిత్య వాళ్ళ ఇంట్లో ఉండడంతో రముర్తి ఆదిత్య కు ఫోన్ చేసి మా దేవిని చూపిస్తారా అని అడుగుతాడు.. అయ్యో రామ్మూర్తి గారు అదెంత పని.. దేవి ఇక్కడే నా పక్కనే ఉంది చూడండి అని చూపిస్తాడు వీడియో కాల్ లో.. మాధవ్ వాళ్ళ నాన్న వాళ్ళు దేవితో వీడియో కాల్ లో మాట్లాడడం చూసి కోపంతో రగిలిపోతాడు.. ఇక వెంటనే రాథ దగ్గరకు వెళ్లి నేను ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెబుతాడు.. వాళ్ళందర్నీ మన ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తాను అని ఆదిత్య వాళ్ళింటికి బయలుదేరుతాడు మాధవ్..
దేవి, ఆదిత్య చెస్ ఆడుతుండగా దేవుడమ్మ వచ్చి దేవి ముందు ఈ పాలు తాగు అని అంటుంది.. ఎప్పుడు చూసినా పాలు తాగు, అన్నం తిను ఇదే చెబుతావు తప్ప ఆడుకోనివ్వవు అంటుంది దేవి.. ఇక మాటల మధ్యలో ఆదిత్య బాగా అడుతున్నవు అని అంటుంది.. అంతేలే నీ సపోర్ట్ ఆఫీసర్ సార్ కేగా అని అంటుంది దేవి.. అవును ఇప్పటికీ ఎప్పటికీ నా సపోర్ట్ మీ ఆఫీసర్ సార్ కేగా అని అంటుంది.. అంతేలే మీ కొడుకు మీదే మీకు ప్రేమ ఎక్కువ అదే నేను నీ సొంత మనవరాలిని అయి ఉంటే మీరు నాకు సపోర్ట్ గా నిలిచేవాళ్ళు కదా అని దేవి అంటుంది అదేం కాదమ్మా అని ఆదిత్య సర్ది చెప్పబోతుండగా.. నీకు ఎవరు ఉన్నా లేకున్నా ఈ నాన్న ఉన్నాడుగా అని మాధవ్ సీన్లోకి వస్తాడు..
దేవి మాధవ్ ను చూసిన ఆనందంలో పరుగున వెళ్ళి హత్తుకుంటుంది.. రా మాధవ్ కూర్చో అని అంటుంది దేవుడమ్మ.. దేవి రామా ఇక మన ఇంటికి వెళ్దాం అని అంటాడు మాధవ్.. లే నాయనా నేను ఆఫీసర్ దగ్గర ఉండే ఇంకా బాగా ఆట నేర్చుకుంటాను అని అంటుంది.. నువ్వైతే నాకోసం ఓడిపోతావు.. అదే ఆఫీసర్ సారైతే నేను ఎలా గెలవాలో చక్కగా నేర్పిస్తున్నాను. నేను ఇప్పుడు రాను అని అంటుంది దేవి.. మాధవ్ కి అవమానంగా అనిపిస్తుంది.. రాధ అన్న మాటలు గుర్తొచ్చి మౌనంగా ఉండిపోతాడు.. రేపు పంపిస్తాలే మాధవ్ దేవి చేత బోనం ఎత్తిస్తున్నాను అని దేవుడమ్మ అంటుంది.. మాధవ్ ఆదిత్య తో దేవి చెస్ లో ఛాంపియన్ గా గెలిచే బాధ్యత నీదే అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు..