Devatha Serial: చిన్మయి కి దేవి కాళ్ళు నొక్కుతూ ఉంటుంది.. ఏమైంది అని అడుగుతుంది రాధ.. స్కూల్లో రన్నింగ్ చేసాము.. అక్క కి బాగా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి.. అందుకే కాళ్లు పడుతున్నాను అని అంటుంది దేవి.. సరే నేను కిందకి వెళ్లి వేడి నీళ్ళు తీసుకు వస్తాను. కాపడం పెడతాను అని అంటుంది.. రాధా వంట గదిలోకి వచ్చి వేడి నీళ్ళు కాస్తుండగా దేవి వచ్చి పాపం కదా అమ్మ చిన్మయి.. నాకంటే అమ్మవి నువ్వు ఉన్నావు.. అక్కకి అమ్మ లేదు కదా అని అంటుంది.. దేవినీ రాధ దగ్గరకు తీసుకుని ఇంకెప్పుడు అలా మాట్లాడకు.. నేను ఉన్నాను కదా మీ ఇద్దరికీ అమ్మని అని అంటుంది రాధ.. పొరపాటున కూడా ఈ విషయం చిన్మయి తో ఎప్పుడూ అని దేవితో అంటుంది రాధ.. సరే అమ్మా అంటుంది దేవి..
దేవి మనసులో మాధవ్ విషాన్ని నింపడానికి మరో కుట్ర పన్నుతాడు. నేను మీ అందరికీ చాలా ఇష్టం. కానీ మీ అమ్మ చూడు నా వైపు ఎప్పుడు ఎలా కోపంగా చూస్తూ ఉంటుందో అని అంటాడు. ఈ మాటలు దేవి మీద చాలా ప్రభావం చూపుతాయి. మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని.. మాధవ్ కావాలని మెట్ల మీద నుంచి కిందకి జారి పడిపోతాడు. అప్పుడు అయితే రాధ వచ్చి నన్ను పైకి లేపదు. ఇక దేవి మనసులో కావలసినంత అనుమానాన్ని నింపచ్చు. ఇదే సరైన సమయం అనుకుని మాధవ్ కావాలని మెట్ల మీద నుంచి కిందకి జారి పడిపోతాడు.. కానీ మాధవ్ కుట్ర తెలిసి రాధ దగ్గరకి కూడా రాదు..
దేవి, రామ్మూర్తి వాళ్ళు వచ్చి మాధవ్ పైకి లేపుతున్నారు. మాధవ్ నడవలేక కర్ర తీసుకొని రమ్మంటే దేవి కర్ర ఎందుకు నాయనా నేను ఉన్నానుగా.. నా భుజం మీద చెయ్యి వేసి నడువు అని అంటుంది. తన కుట్ర తెలిసి కోపంగా చూస్తుంది. మాధవ్ నొప్పి లేక పోయినా కావాలని నొప్పి నొప్పి అంటూ పిల్లలు మందు రాయడం వచ్చి రాధ అక్కడి నుంచి వెళ్లి పోతుంది..
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…