దేవి ఇంట్లో మాధవ్ తో కలిసి చెస్ ఆడతాడు.. దేవి ఫైనల్ గా మాధవ్ కి చెక్ మేట్ పెడుతుంది.. దేవి ఆట ను చూసి ఇంట్లో వాళ్ళందరూ సంబరపడతారు.. రాధా దేవికి జడ వేస్తుండగా.. దేవి నేను ఆ పొద్దు ఆదిత్య సారి దత్తతి తీసుకుంటానంటే వెళ్లకుండా.. తప్పు చేశాను అని అంటుంది..
మాధవ్ కి వార్నింగ్ ఇచ్చిన ఆదిత్య.. రుక్మిణీ బోనం తీసుకుని రావడం దేవుడమ్మ చూస్తుందా.!?
ఆఫీసర్ తో పాటు నేను ఉంటే నేను బాగా చదివిస్తాడు.. మంచి మంచి ఆటలు నేర్పిస్తాడు.. నన్ను కలెక్టర్ చేస్తాడు అని దేవి చెబుతుంది.. ఆ మాటలు విని పక్కనే ఉన్న మాధవ్ వింటూ లోలోపల రగిలిపోతూ ఉంటాడు.. ఈ విషయాన్ని వెంటనే రాధా అది ఎక్కువ ఫోన్ చేసి చెబుతుంది.. పెనిమిటి ఈరోజు నాకు ఎంత సంబరంగా ఉందో నీకు ఎరుకనా.. దేవిని గురించి ఏం చెప్పిందో తెలుసా అంటూ.. దేవి నీ దగ్గరకు దత్తత రావాలి అని అనుకుంటుంది.. దేవి నా గురించి ఇంత మంచిగా ఆలోచిస్తుంది అంటే.. తనలో మార్పు మొదలైంది.. నామీద నమ్మకం కలిగింది.. నాకు అదే చాలు అని ఆదిత్య అంటాడు.. నువ్వు ఇంత సంతోషంగా నవ్వి ఎన్ని రోజులైందో రుక్మిణి అని అంటాడు.. నాకు దేవి తో పాటు మీ ఆనందం కూడా ముఖ్యం అని ఆదిత్యా అంటాడు..
రాధా మాధవ్ దేవి ముగ్గురు కలిసి చెస్ పోటీలకు వెళ్తారు. కాకపోతే అక్కడ పాస్ లేకపోవడంతోనే గేటు బయటే వాళ్ళను ఆపేస్తారు. వెంటనే ఆదిత్య రాగానే మీరు చెప్పింది ఈ పాప గురించి అని నాకు తెలియదు.. సార్ క్షమించండి అని వాచ్మెన్ అందర్నీ లోపలికి పంపిస్తాడు. దేవి ఇక చెస్ ఆడటానికి గెలుస్తుంది సిద్ధమవుతుంది. దేవి గెలుస్తుందా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం.. మరోవైపు దేవుడమ్మ దేవి గెలవాలని ఆ దేవుడికి మొక్కుకుంది..