ఆదిత్య టిఫిన్ చేస్తుండగా దేవుడమ్మ సత్య ఇద్దరు కలిసి ఆదిత్య కు వడ్డిస్తారు.. ఆదిత్య ఎప్పుడు బయట విషయాలేనా.. ఇంట్లో విషయాలు కూడా పట్టించుకోమని దేవుడమ్మ అంటుంది.. సత్య ను తీసుకొని అమెరికా వెళ్ళమని దేవుడమ్మ చెబుతుంది ఇప్పుడు కాదు అని ఆదిత్య విస్సుకుంటడు.. ఎప్పుడు మీకు పిల్లల ధ్యాసనా మరో ధ్యాసేనా వేరే ఆలోచన లేదా అంటూ ఆదిత్య అనగానే.. ఈ అమ్మ మీద కూడా ప్రేమ తగ్గిపోయిందా.. ఈ అమ్మ మాటకి ఎదురు చెప్పే అంతగా తయారయ్యావా.!? సత్య ను అమెరికాకు తీసుకెళ్లకపోతే నా నిర్ణయం ఎలా ఉంటుందో నువ్వు చూస్తావని దేవుడమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
దేవి మాధవ్ దగ్గరకు వచ్చి ఎందుకు నాయనా నాకు అబద్ధం చెప్పావని నిలదీస్తుంది.. నేను నీకేం అబద్ధం చెప్పాను అని మాధవ్ అడుగుతాడు.. నువ్వు చెప్పబట్టే కదా తను మా నాన్న అని నేను అనుకున్నాను.. ముందుగా ఆలోచించకుండా అలా ఎవరిని పడితే వాళ్ళు మా నాన్న అని చెప్పేయటమేనా.. పెద్దవాడివి నువ్వే కాస్త ఆలోచించి చెప్పాలి కదా .. అయినా నాకు అబద్ధం చెప్పాలని నీకు ఎందుకు అనిపించింది అని దేవి అడుగుతుంది.. నువ్వు బాధపడటం నాకు ఇష్టమా దేవి.. తను నీ ఫోటో మీ అమ్మ ఫోటో పట్టుకుని కనిపిస్తే నిజంగా మీ తండ్రి అనుకున్నాను.
తను అలా బాధపడుతుంటే నిజంగా మీ నాన్న నేనేమో అని అనిపించింది. అందుకే అలా చేశానమ్మ దేవి ఇంకోసారి అలా చేయను నిన్ను బాధ పెట్టను సారీ అని మాధవ్ దేవితో మాట్లాడుతుండగా.. నువ్వు ఎవరిని మీ నాయన గురించి అడగాల్సిన అవసరం లేదు.. ఇక్కడ నుంచి నడు అని రాధ అంటుంది.. నువ్వు మా నాన్న ఎవరో చెప్పమంటే చెప్పవు.. నాకు మా నాన్న గురించి ఎలా తెలుస్తుంది అని దేవి అంటుంది.. నీ మీద ఒట్టేసి చెబుతున్న బిడ్డ.. మీ నాన్న గురించి నీకు కచ్చితంగా చెబుతాను అని రాధ అంటుంది.. రాధ నిర్ణయం విన్న మాధవ్ షాక్ అవుతాడు..