అనుబంధాలకు నిలయం అనే చక్కటి ట్యాగ్ లైన్ తో బుల్లితెరపై ప్రసారమవుతుంది దేవత సీరియల్.. ఈ సీరియల్ ఇప్పటికే 630 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.. సరికొత్త కథనంతో ఊహించని మలుపులు తిప్పుతూ బుల్లితెర ప్రేక్షకులను ఈ సీరియల్ చక్కగా ఆకట్టుకుంటుంది.. ఈ వారం జరిగిన ఎపిసోడ్ హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..
మాతో తన కుట్రతో ఎలాగైనా దేవిని తన ఇంటి నుంచి పంపించకుండా చేయాలని ప్లాన్ చేస్తూనే ఉంటాడు.. ఎప్పుడు చూసినా దేవికి వాళ్ళ నాన్న గుర్తుకు వచ్చే విధంగా ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటాడు.. మాధవ్ వేసిన ఎత్తుగడలకు రాధా ఆదిత్య ఇద్దరు దేవిని మనసు మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండడంలోనే సరిపోతుంది.. దేవి కాస్త కూల్ గా ఉంది అనుకున్నప్పుడు.. మాధవ్ మరో ప్లాన్ చేయడం.. రాదా ఆదిత్య మళ్లీ దేవిని కామ్ చేయడానికి ప్రయత్నించడం.. వన్ బై వన్ ఇలాగే జరుగుతూ వస్తోంది..
కమలకి పాప పుట్టింది.. ఈ విషయం తెలుసుకున్న రుక్మిణి ఎలాగైనా ఆ పాపను తన చేతులతో ఎత్తుకొని ముద్దాడాలి అని అనుకుంటుంది.. భాగ్యమ్మ కూడా నేను చనిపోయేలోపు మీ ముగ్గురు అక్క చెల్లెలు కలిసి ఓ చోట కనిపిస్తే చూడాలని అనుకుంటున్నాను అని అంది.. రుక్మిణి ఆదిత్య కు ఫోన్ చేసి ఎలాగైనా ఫంక్షన్కు రావాలని అనిపిస్తుంది అని చెబుతుంది. ఇప్పుడు నువ్వు ఎలా వస్తావు అని ఆదిత్య అడుగుతాడు. ఏమో పెనిమిటి నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు నాకు మాత్రం కమల్ అక్క బిడ్డను ఎత్తుకోవాలని అనిపిస్తుంది అని చెబుతుంది.. మొత్తానికి రుక్మిణి ఆ ఫంక్షన్ కు వస్తుంది కాకపోతే తను మాస్క్ కట్టుకొని వస్తుందా.. అప్పుడే భాష రుక్మిణి గుర్తుపడతాడు.. ఇదే వచ్చేవారం హైలెట్ సీన్..