మాధవ్ ఆదిత్య కి ఫోన్ చేసి రమ్మని చెబుతాడు.. మీరు ఆఫీసర్ కదా మీకు చాలా పనులు ఉంటాయి.. నాకోసం వచ్చినందుకు థాంక్యూ కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలి.. మీరు ఇకమీదట నా భార్యను బిడ్డను కలవడానికి వీల్లేదు.. ఇంకొకసారి దేవిని నా దగ్గర నుంచి మీ ఇంటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయవద్దు.. రాధతో మాట్లాడవద్దు.. ఎందుకంటే వాళ్ళిద్దరూ నా భార్య బిడ్డలు అని మాధవ్ తో చెబుతాడు.. దాంతో కోపం కట్టలు తెంచుకొచ్చిన ఆదిత్య మాధవ్ చంప పగలగొడతాడు..
నువ్వు ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతుంటే నేను మౌనంగా ఊరుకుంటున్నాను అంటే.. అందుకు కారణం నా భార్య మంచితనం.. నీ బిడ్డ అనాధ అయిపోతుంది.. మీ అమ్మానాన్నలు బాధపడతారు అన్న ఒకే ఒక విషయం ఆలోచించి రాదా నాతో పాటు రాకుండా ఆగిపోతుంది.. నువ్వు ఆ విషయాన్ని అలుసుగా తీసుకొని ఈరోజు నా దగ్గరికి వచ్చి నా బిడ్డతో మాట్లాడొద్దు అని చెబుతావా.. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు అని చెబుతాడు ఆదిత్య.. మాధవ్ ఇదంతా తన కుట్రలో భాగంగా చేస్తాడు.. మాధవ్ తన ఫోను ఆదిత్య కొట్టిన సన్నివేశాన్ని షూట్ చేసి పక్కన పెడతాడు..
రాడ్ దగ్గరికి వెళ్లి మాధవ్ ఆదిత్య నన్ను కొట్టాడని చెబుతాడు. నువ్వు నమ్మడం లేదు కదా అని వీడియో తీసి ఇదిగో ఆదిత్య కొట్టాడు అని చూపిస్తాడు.. నువ్వు కనుక దేవికి ఆదిత్య తన తండ్రి అని చెబితే.. నేను ఈ వీడియో చూపించి దేవికి ఆదిత్య మీద లేనిపోనివి చెబుతాను.. దేవి నా మాట వింటుంది.. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేసుకోమని రాధ ను ఇరకాటంలో పెడతాడు మాధవ్..
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!