Devatha Serial: మాధవ్ దగ్గరకి వచ్చి రాధ ఏంటి సార్ మీరే ఇలా ఉన్నారు అనుకుంటే.. ఇప్పుడు మీ అమ్మ నాయన దిమాక్ కూడా ఖరాబు చేస్తున్నారు అని అంటుంది.. ఏదైనా చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాధవ్ అంటాడు.. మీరు అసలు మనిషేనా.. మీ కూతురు చిన్మయిని నేను కనకపోయిన పాలిచ్చి పెంచాను.. మీకు ఆ విశ్వాసం కూడా లేదా సార్ అని రాధ అంటుండగా.. ఆ మాటలను దేవి వింటుంది.. తన తప్పు తెలుసుకుంటుంది..!
ఆదిత్య వాళ్ళ నాన్న వాళ్ళ అక్కయ్య సీరియల్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఇంట్లోకి వస్తూ వస్తూనే పెద్ద గొడవ చేస్తుంది. అందరినీ దబాయిస్తు మాట్లాడుతుంది. ఆదిత్య సత్య కూడా వెళ్లి వాళ్ళ అత్తయ్య పలకరిస్తారు. నువ్వు ఇంకా కొత్త పెళ్లి కూతురు లాగా కనిపిస్తున్నావు. మీకు పెళ్లి అయ్యి పదేళ్లు అయింది అంటే ఇద్దరు పిల్లలు ఉండాలి. పిల్లలు ఎక్కడ అని అడుగుతుంది. ఆ మాట వినగానే ఆదిత్య మౌనంగా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. కొత్తగా వచ్చిన ఈమె వలన సత్యకు ముందు ముందు ఎన్ని చిక్కులు ఎదురవుతాయో..
దేవి వాళ్ళమ్మ దగ్గరకి వెళ్ళి హత్తుకుంటుంది.. ఏమైంది దేవమ్మ అని అడుగుతుంది. నీకు సారీ చెప్పాలి. నువ్వు మా అమ్మ కాదని నిన్ను బాధపెట్టాను కదా.. ఆఫీసర్ సార్ కూడా చెప్పారు నిన్ను బాధ పెట్టద్దని చెప్పారు అని అంటుంది.. నేను నిన్ను బాధపెట్టాను నన్ను క్షమించు అమ్మా అని దేవి అంటుంది. బిడ్డలు తప్పు చేస్తే అమ్మా ఎప్పుడైనా క్షమిస్తుందని దేవిని ఆప్యాయంగా హత్తుకుంటుంది రాధ. ఆదిత్య , సత్య కూడా వచ్చి వాళ్ళ అత్తయ్య ను పలకరిస్తారు.. ఆమె సత్యం నువ్వు పెళ్లి అయ్యి పది ఏళ్ళు అయినా ఇంకా కొత్త పెళ్లికూతురు లాగానే ఉన్నావు. పెళ్లి అయ్యి పది ఏళ్ళు అయింది అంటే నీకు ఇద్దరు పిల్లలు ఉండాలి. పిల్లలు ఎక్కడ అని అడుగుతుంది. వెంటనే ఆదిత్య అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు.