ఆదిత్య రాధ చెప్పినా ఆనవాళ్లను పట్టుకుని.. దేవికి నాన్నగా వచ్చిన అతన్ని వెతకాలని ఆ ఊర్లో వెళ్లి వెతుకుతూ ఉంటాడు.. సరిగ్గా మాధవ్ కూడా అక్కడికి వచ్చి ఏంటి ఆఫీసర్ సారు.. నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వచ్చి కచ్చితంగా వెతుకుతావని అని మాధవ్ ఆదిత్యతో ఉండడు. రేయ్ మాధవ్ అని మాధవ్ షర్టు పట్టుకొని నేను మీ ఇంట్లో నుంచి దేవిని నా భార్యను తీసుకురావడం లేదు అంటే నాకు చేతకాక కాదు.. ఒక్కసారి మిగతా విషయాలు మర్చిపోయా ఆలోచిస్తే నిన్ను చంపడం నాకు నిమిషాల్లో పని అని మాధవ్ తో అంటాడు.. నువ్వు ఎంత వెతికినా వాడు దొరకడు ఆఫీసరు అది నా ప్లాన్ కాబట్టి అని మాధవ్ అంటాడు..
మాధవ్ రాధ దగ్గరకు వెళ్ళి ఏంటి నా ప్లాన్ మీకు నచ్చలేదా అని అంటాడు.. రాధ మాధవ్ మాటలకు కోపం వచ్చిన రాధ తనని చెంప చెళ్లుమనిపించలి అని చెయ్యి ఎత్తుతుంది.. దానికి రాధ మీద కోపం వచ్చింది మాధవ్ కి.. నీ మీద చెయ్యి ఎత్తగానే చుట్టూ ఎవరున్నారని వెతుక్కుంటూ వనికి పోతున్నావు నీకు నేను కావాల్సి వచ్చానా.. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ చేయి ఇక్కడితో ఆగదు.. చంప మీద పడి తీరుతుంది అని రాధా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది మాధవ్ కి..
రాధ నువ్వు నా చంప మీద కొట్టబోయావు.. కదా.. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని దేవికి తండ్రిలా పరిచయం చేసిన అతనికి ఫోన్ చేసి నేను చెప్పింది చెయ్యి నువ్వు నీ సొంత ప్రయత్నాలు వాడకు దేవిని నువ్వు మీ ఇంటికి తీసుకెళ్ళు తనని జాగ్రత్తగా చూసుకో.. నేను చెప్పే వరకు తనని బయటకు తీసుకురావద్దు నేను అనుకున్నది అనుకున్నట్టు జరగాలి సరేనా అని మాధవ్ అంటాడు.. మాధవ్ రాధ ను దూరంగా చూస్తూ.. నువ్వు నన్ను చంప దెబ్బ కొట్టాలి అని అనుకున్నావు కదా.. దానికి ప్రతిఫలంగా నీకు నీ పెనిమిటి కి ఊపిరాడనివ్వకుండా చేస్తాను.. నా బిడ్డ ఎక్కడ నా బిడ్డ ఎక్కడ అని మీరు వెతుక్కోవాలి.. చివరికి మాధవ్ సార్ నా బిడ్డ ఎక్కడ అని నా కాళ్లు దగ్గర పడి నువ్వు ఏడవాలి.. నా బిడ్డను చూపించమని నువ్వు నా దగ్గర అడుక్కోవాలి నా బిడ్డ ఎక్కడ అని చూస్తూ ఉండు అని మాధవ్ దూరంగా ఉన్న రాదని చూస్తూ అనుకుంటాడు..